అతడికి సినిమా నేపథ్యం లేదు.. అతడిది నాటక రంగ నేపథ్యం కూడా కాదు.. మంచిగా చదువుకొని ఉద్యోగం చేద్దామని హైదరాబాద్ వచ్చిన ఆ యువకుడు ఇప్పుడు ఎందరికో నటనలో పాఠాలు చెబుతున్నాడు. పెద్ద పెద్ద సినిమాల్లో తళుక్కున మెరుస్తున్నాడు. టికెట్ తీసుకొని సినిమాకు వెళ్లడమే తప్ప తాను నటించిన సినిమాకు అందరూ టిక్కెట్ కొంటారని ఎప్పుడూ అనుకోని అతడి కలను సాకారం చేసిందేంటో తెలుసా నాటకమే.. నటనలో ఓనమాలు తెలియని అతడికి పవన్‌కల్యాణ్, అల్లు అర్జున్‌లాంటి పెద్ద నటులతో నటించే అవకాశాన్ని ఇచ్చింది ఆ నాటకమే..అందుకే సినిమాల్లో నటిస్తూ కూడా ఔత్సాహికులకు నటనలో తనదైన శైలిలో శిక్షణ ఇస్తున్నాడు అజయ్ మంకెనపల్లి. పూర్తి వివరాల కోసం ఈ వీడియో చూడండి.