e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, November 27, 2021
Home News ఆగమ శాస్త్రం ప్రకారం శివుడు, గణపతి, విష్ణువు, అమ్మవారి ఆలయాలను ఒకేచోట కట్టుకోవచ్చా?

ఆగమ శాస్త్రం ప్రకారం శివుడు, గణపతి, విష్ణువు, అమ్మవారి ఆలయాలను ఒకేచోట కట్టుకోవచ్చా?

శివుడు, గణపతి, విష్ణువు, అమ్మవారి ఆలయాలను ఒకేచోట కట్టుకోవచ్చా?-రమణాచారి, కొత్తకోట

తప్పకుండా. సరైన స్థలం చూసుకొని మీరు సంకల్పిస్తున్న మూర్తులతో గుళ్లు కట్టవచ్చు. స్థలాన్ని ఎంపికచేసుకొని, దానికి నాలుగు వైపులా వీధులు వచ్చేలా ప్లాను చేసి ప్రాకారం కట్టి అందులో ఆలయాలను నిర్మించండి. స్థపతి సూచనల మేరకు, ఒకే మహామండపంతో శివ పంచాయతనాన్ని అనుసరించి తూర్పు ముఖంగా శివుణ్ని ప్రధానంగా చేసుకొని… ఈశాన్యంలో అమ్మవారిని, వాయవ్యంలో గణపతిని, ఆగ్నేయంలో విష్ణుమూర్తి విగ్రహాలను నిలుపుకొని ఒకే ప్రాంగణంలో గుళ్లను కట్టుకోవచ్చు. ఆలయాల నిర్మాణం, ఇళ్ల నిర్మాణం ఒకటిగా ఉండదు. ఆలయాలను ఆగమ శాస్త్రం ప్రకారం నిర్మించాలి.

- Advertisement -

దక్షిణం- పశ్చిమం రోడ్లు ఉన్న ఇల్లు కొనవద్దా? -బత్తుల సత్యవతి, రామన్నపేట

పశ్చిమం దక్షిణం రోడ్లు ఉన్న నైరుతి బ్లాకు ఇంటిమీద అపోహలు ఎక్కువ. కానీ, అన్ని జాగ్రత్తలూ తీసుకొని కడితే ఈ బ్లాకు ఇల్లు ఎంతో శ్రేష్ఠంగా ఉంటుంది. నైరుతి ఇల్లు కొనవద్దు అనేది తప్పు ఆలోచన. ఆ గృహం నైరుతి బ్లాకును దృష్టిలో పెట్టుకొని కట్టిందా కాదా.. అని చూసుకొని మార్పులు చేర్పులకు సిద్ధపడి కొనండి. ముఖ్యంగా ఈ బ్లాకు చుట్టూ కాంపౌండు ఉండాలి. ఇంటి చుట్టూ ప్రదక్షిణం వచ్చి తీరాలి. అలాంటి నిర్మాణం అయినప్పుడే ముందుకు వెళ్లాలి. నైరుతి భాగం లేదా పశ్చిమం వైపు పెద్ద కాలువ లేదా లోతుగా ఉన్న రోడ్డు ఉంటే ఆ ఇంటివైపు చూడాల్సిన అవసరం లేదు.

తూర్పు ఖాళీ లేకుండా, పశ్చిమ ముఖంగా ఉన్న ఇంటికి పశ్చిమంలో వరండా వేసుకోవచ్చా? -ఆనంద ప్రసాద్‌, కొంపల్లి

పశ్చిమ దిశ వీధిని అనుసరించి పశ్చిమ సింహద్వారంతో ఇల్లు కట్టేవాళ్లు తూర్పు ఖాళీ ఎంత వదలాలో నిర్ధారించుకున్నాకనే నిర్మాణానికి సిద్ధంకావాలి. తూర్పు హద్దు చేర్చి, అంటే అటు దిక్కు ఏమాత్రం ఖాళీ వదలకుండా ఉన్న ఇంటికి పశ్చిమ దిశలో పశ్చిమ వాలుతో వరండా వేస్తే ఆ గృహస్థులు పక్షవాతంతో దీర్ఘకాలం అవస్థలు పడతారు. తప్పనిసరిగా మీరు తూర్పులో ఇంటిని తెంపి, పైనుంచి కిందికి సూర్యరశ్మి వచ్చేలా నాలుగు అడుగులు ఓపెన్‌ చేసుకున్న తర్వాతే పశ్చిమ దిశలో వరండాను ప్లాన్‌ చేయండి. లేదంటే జీవనం కష్టం. తూర్పు, ఉత్తరం ఖాళీ లేని ఇల్లు జీవచ్ఛవాల నిలయం.

ఈశాన్యం ఇల్లు కొంటే ఏ సమస్యలూ ఉండవా? -రాచవోలు సత్యం, ఆమనగల్లు

ఈశాన్యం దిశ గృహాల్లో కూడా ఎన్నో దోషాలు ఉంటాయి. దోషాలు ఉన్నప్పటికీ ఇబ్బందులు రావని అనుకోవద్దు. ఉత్తరం హద్దుమీద నిర్మాణమై, ఉత్తరం పొడవు తగ్గి ఉన్న ఇంట్లో స్త్రీలు అనారోగ్యంతో ఆర్థిక దుస్థితికి లోనై అకాల మరణం పొందుతారు. లేదా ఏండ్లుగా మంచాన పడి ఉంటారు. శాస్త్రబద్ధంగా అన్ని జాగ్రత్తలతో నిర్మించినప్పుడే ఈ బ్లాకు గొప్పగా ఉంటుంది. ఈ ఈశాన్యం బ్లాకు గృహానికి ఈశాన్యం తెంపుచేసినా, మూతవేసినా దుష్ఫలితాలు కలుగుతాయి. లోకంలో కొన్ని అవాస్తవాలు ప్రాచుర్యంలో ఉంటాయి. ఈశాన్యం బ్లాకు ఇల్లు గొప్పదని అనుకోవడం అందులో భాగమే.

ఉత్తరం వైపు దుకాణాలు కట్టుకోవచ్చా? పశ్చిమం వైపే ఉండాలా?-రాతి చంద్రశేఖర్‌, ఆలేరు

పశ్చిమ దిశ దుకాణాలు బాగా నడుస్తాయి. తూర్పు- ఉత్తరం దుకాణాలు బాగా నడవవు అన్నది భ్రమ మాత్రమే. దుకాణాలను అన్ని దిశల రోడ్లకూ అభిముఖంగా నిర్మించుకోవచ్చు. దోషం లేదు. ఉత్తరం దిశగా దుకాణం వేసుకుంటే అందులో పశ్చిమం గోడకు వీపుతో తూర్పు ముఖంగా కుర్చీ వేసుకొని కూర్చోవాలి. గల్లా పెట్టెను కుడివైపు వచ్చేలా ఏర్పాటు చేసుకోవాలి. అదే దుకాణంలో రోడ్డువైపు ఉత్తరం ముఖంగా కూర్చోవచ్చు. కుర్చీ బల్ల ఉపయోగించకపోతే కింద కూర్చోవచ్చు. అరుగు వేసుకొని కూడా కూర్చోవచ్చు. అయితే స్థిర నిర్మాణం చేసేవాళ్లు ఆ అరుగును ఉత్తరం హద్దుకు తాకకుండా, నైరుతి భాగాన వేసుకొని కూర్చోవాలి. ఉత్తరం దిశ దుకాణాల్లో ఈశాన్యం లేదా ఆగ్నేయం మూలల్లో కూర్చొని వ్యాపారం చేయకూడదు.

సుద్దాల సుధాకర్‌ తేజ
suddalavasthu@gmail.com
Cell: 7993467678

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement