– కనికరాల రాము, భైరాన్పల్లి
మనకు ఇష్టమున్నట్లు ఏదీ ఉండదు. ప్రతి దానికీ పరిధి అనేది ఉంటుంది. ఎంత వెడల్పు అనేదాన్ని బట్టి అంత పొడవును నిర్ధారిస్తారు. ఆ నిష్పత్తిలోనే నిర్మాణాలు జరుపుకోవాలి. పొడవును మూడు భాగాలు చేస్తే అందులో రెండు వంతుల వెడల్పుగా నిర్మాణం చేసుకోవాలి. స్థలం ఉన్నది కదా అని పన్నెండు ఫీట్ల వెడల్పుతో వంద ఫీట్ల పొడవు కట్టే ప్రయత్నం చేయొద్దు. అవి పైపులైన్ ఇండ్లు అవుతాయి. వాటిల్లో నివాసం మంచిది కాదు. చాలామంది వ్యాపారవేత్తలు అతి తక్కువ వెడల్పుతో పొడవైన పొట్లకాయ గృహాలు కట్టుకొని అందులోనే రోడ్డు వైపు షాప్ నిర్వహిస్తూ, లోపల నివాసముంటారు. అది మంచిది కాదు. షాప్ పెట్టుకోవచ్చు కానీ అందులో సంసారం మంచిది కాదు. ఇలాంటి నివాసాలు సంతానానికి ఆటంకంగా మారుతాయి. మానవ నివాసాలకు సరైన కొలతలు అవసరం కనుక తెలుసుకొని నిర్మించుకోవాలి.
– వి. శారద, ఆలేరు
ఏదైనా మనకు బాగున్నదే కదా కావాలి. ప్రయాణాలు చేసే సమయంలో దారిలో ఏ హోటల్ బాగుంటుందో తెలుసుకొని మరీ భోజనం చేస్తాం కానీ.. ఆ ఒక్కపూటకు ఏంకాదులే అని రుచిలేకున్నా తినం కదా. నివాసాలు ఊర్లో ఉండొచ్చు, నగరాల్లో ఉండొచ్చు. నగరాల్లో మనం మన పిల్లలకోసం నిర్మించుకున్నా.. ముఖ్యమైన సందర్భాల్లో ఊరెళ్లి నాలుగు రోజులు అక్కడ ప్రశాంతమైన జీవితం గడపాలంటే ఊరిలోని ఇల్లు కూడా బాగుండాల్సిందే.

మీరు ఉద్యోగం చేస్తున్నట్లయితే విరమణ పొందాక ఊరికి పోయి ఉండాల్సి వస్తుందేమో. లేదంటే మన పిల్లలు అక్కడే సెటిల్ కావొచ్చు. రాజీ ధోరణి ఉండొద్దు. అన్నీ చక్కబరచుకుంటేనే సమస్యలు రాకుండా మానటం లేదు. సమస్యలు తీవ్రరూపం దాల్చి మనల్ని కబలించకుండా ఉండాలంటే.. మన నివాస పరిసరాలు సుందరంగా, శుభ్రంగా, శాస్త్ర సమ్మతంగా ఉండాలి.
– బత్తుల శాంతి, గోపన్పల్లి
ఎకరం ఉన్న స్థలం అయితే ముందుగా ఏ చోట నిర్మాణం చేయాలని నిర్ణయించుకుంటారో.. ఆ స్థలాన్నంతా రాళ్లు రప్పలు, ఎత్తు పల్లాలు లేకుండా శుద్ధి చేసి.. దాన్ని తొంభై డిగ్రీలకు సరిచూసుకోవాలి. అప్పుడే దానికి ఓ రూపం వస్తుంది. ఆ స్థలానికి కాంపౌండ్ తప్పనిసరిగా నిర్మించుకోవాలి. ఆ తరువాత అందులో ఇల్లు ప్లాన్ చేసుకోవాలి.

స్థలం చిన్నగా ఉందంటే అందులో ఇల్లు కట్టేందుకు స్థలం మొత్తం మెట్న దిశకు కుదిరించుకొని దానిని గృహ నిర్మాణానికి వాడుకోవాలి. పది పదిహేను ఎకరాలకు మించి ఎక్కువ ఉన్న ఫామ్ స్థలంలో మొత్తం కాంపౌండ్ దిశలను సవరించి కట్టలేం. కానీ కట్టుకునే ఆ పరిమిత స్థలానికి మాత్రం కాంపౌండ్ అవసరమవుతుంది.
– లాహిరి విద్యాసాగర్, నల్లగొండ
వేరు వేరు ఇండ్లు కట్టుకోవడం తప్పుకాదు. కానీ అవి ఎందుకు, అందులో ఎవరెవరు ఉంటారనేది ముఖ్యం. అలా ఒకేచోట కట్టుకున్నట్లయితే వాటికి వేరువేరుగా కాంపౌండ్లు కట్టాలి. కంపౌండ్లతో వేరు చేశాక దక్షిణం ఇంటిని నివాసం కోసం, ఉత్తరం ఇంటిని ఆఫీస్కోసం వినియోగించుకోవాలి.

అన్నదమ్ముల కోసమైతే దక్షిణం ఇంటిని పెద్దవాళ్లు వాడుకోవాలి, ఉత్తరం నివాసాన్ని చిన్నవాళ్లు ఉపయోగించుకోవాలి. ఒకే యజమాని ఆ రెండు ఇండ్లను కట్టుకుంటే రెండు ఇండ్లకూ రెండు నీటి సంపులు ఉండాలన్న పద్ధతి అవసరం లేదు. ఉత్తరం వైపు ఉన్న ఇంటిలో ఈశాన్యం లేదా తూర్పు దిశలల్లో నీళ్ల సంపును ఏర్పాటు చేసుకోవచ్చు.
– సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 98492 78143