– కె. ధనలక్ష్మి, ఘట్కేసర్.
రెండు రోడ్ల బలం.. ఆ ఇంటికి ఉంటుంది. బలం అంటే శక్తిపూరితం అనేదిగా అర్థం చేసుకోవాలి. వీధులు గృహానికి ముఖాన్ని నిర్దేశిస్తాయి. తద్వారా గృహజీవనం కొనసాగుతుంది. రెండు రోడ్లు ఉన్నప్పుడు ఆ రెండు కలవగా వచ్చిన మూల.. చాలా శక్తి సమన్వితం అవుతుంది. అంటే.. తూర్పు రోడ్డు – ఉత్తరం రోడ్డు ఆ ఇంటికి వచ్చినప్పుడు అది ఈశాన్యం దిశను చాలా ఉత్కృష్టంగా నిలిపి.. ఈశానుని ప్రభావాన్ని అందిస్తుంది. అంటే.. ఈశ్వర శక్తిని సమూలంగా ఇవ్వడానికి నిలబడుతుంది. ఇంటిని కట్టిన విధానాన్ని బట్టి దాని బలాబలాలు రూపొందుతాయి. ఇంటి స్థలం బలమైనదైనా.. ఇంటి నిర్మాణం గొప్పగా లేకపోతే.. ఆ శక్తి నిష్ప్రయోజనం అవుతుంది. అంటే.. మంచినీరే కానీ డ్రైనేజీలోకి వెళ్తున్నట్టు! అలా శక్తిని ఆ వీధులు కలిసే చోటు నిర్ణయిస్తుంది. ఇలా నాలుగు మూలల శక్తి.. గృహానికి ఆపాదించబడుతుంది.
పశ్చిమం – ఉత్తరం కలిసినప్పుడు వాయవ్యం దిశ.. పడమర – దక్షిణం కలిసినప్పుడు నైరుతి దిశ.. దక్షిణం – తూర్పు కలిస్తే ఆగ్నేయం దిశల శక్తులు ఆ గృహాన్ని తమతమ గుణాలతో ఆవిష్కరిస్తాయి. అయితే.. ఆ వీధులు కూడా బలహీనమై పోతుంటాయి. వాటిలోని దిశల ప్రభావంచేత అన్నీ పూర్ణంగా దిశాత్మకంగా ఉండవు ఒక్కోచోట. గింజలేకానీ.. తాలువి అన్నట్టు! వీధులేకానీ, దిశలు లేని బలహీనమైనవి. అప్పుడు వాటి బలంలో చాలా తేడాలు వస్తాయి. ఇలా వచ్చిన వీధులు వాటి స్వరూప – స్వభావాలను పరీక్షించి నిర్ధారించాల్సి ఉంటుంది. అందుకే, అన్నీ ఇండ్లేకానీ, ఆయా స్థలాల రోడ్లను బట్టి వాటి ఉచ్ఛనీచ స్థానాలు ఉంటాయి. ఒక్కోస్థలం ఒక్కో గృహం.. ఒక్కో విశిష్ట గుణగణాలతో ఉండటం జరుగుతుంది.. వీధుల కారణంగా!
– ఎం. వీరేశ్, కాచిగూడ.
ఈకాలంలో వాటిని ‘యమపాశాలు’ అని పిలవాల్సి ఉంటుంది. మన స్థలంలో హెచ్‌టీ పవర్ లైన్ ఏ దిక్కు ఉన్నా మంచిదికాదు. అవి ఉంటే వాటినుంచి కనీసం అరవై అడుగుల ఆవలే నిర్మాణం చేయాల్సి ఉంటుంది. వాటికి దగ్గరలో నిర్మాణం ఉంటే.. ఎలక్ట్రానిక్ వస్తువులు పనిచేయవు. అలాగే తీవ్రమైన ఆరోగ్య సమస్యలూ వస్తాయి. కాబట్టి సాధారణ ఇంటి స్థలాల మీద, పక్కనుంచి ఈ పెద్ద లైన్ తీగలు వచ్చినప్పుడు కింద ఫ్లోర్ కట్టుకుందాం.. పైన ఉంటే ఏంటి? అనుకోవద్దు. అలాంటి స్థలంలో ఇంటి నిర్మాణం చేయకపోవడమే మంచిది. ఇల్లు లేకున్నా.. అద్దె ఇల్లు అయినా మంచిదేకానీ.. హై టెన్షన్ వైర్లకింద, వాటికి దగ్గరగా ఇల్లు కట్టడం మంచిదికాదు. అది ఎప్పటికీ టెన్షన్ ఇల్లే అవుతుంది.
– ఎ. రేణుక, పల్లెపహాడ్ (భువనగిరి జిల్లా)
ఇంటి స్లాబుమీద ఒక గదికి ప్రధాన స్థానం నైరుతి మూలనే! అదే సముచిత స్థానం. నీళ్ల ట్యాంకును మార్చుకోవాలి తప్ప.. గదిని మార్చుకొని వేరొక స్థానంలో వేసుకోవద్దు. అపసవ్యం అవుతుంది. పైగా మీరు కట్టాలనుకునే ఆ ఒక్క గదికి కూడా నీళ్లు రావాల్సి ఉంటుంది. అప్పుడు నీళ్ల ట్యాంక్‌ను ఎత్తు చేయాల్సి వస్తుంది. అంటే నైరుతిలో గదికట్టి.. దానిపైన ట్యాంకును అమర్చుకుంటేనే ఆ గదికి నీళ్లు అందుతాయి. కాబట్టి, అది సిమెంటు ట్యాంకు అయినా, సింటెక్స్ ట్యాంకు అయినా.. మార్చక తప్పదు. ఇకపోతే.. మొత్తం స్లాబు ఓపెన్‌గా పెట్టి ఒక్క గదిని వేయడం వల్ల ఒక అనుకూలత, ఆనందం దక్కాలి అంటే.. అందుకు నైరుతి భాగమే ప్రశస్తమైనది. కాబట్టి మిగతా దిశలలో ఒక్క గదిని వేయకూడదు.
– కె. సుజాత, బాలానగర్.
ఇంట్లో పిల్లల కోసం లేదా గెస్టు కోసం కూడా ఒక పడక గదిలో.. ఒకదాని మీద ఒకటిగా రెండు బెడ్లు వేసుకుంటారు. ఇందుకుగాను కొందరు మంచాలనే రెండు వేయడం లేదా గదిలో పెద్ద అటకలాగా ఒక స్లాబ్ (మెజనైన్) వేస్తారు. దానిపైన మరొక పడకను ఏర్పాటు చేసుకుంటారు. ఇలా మాస్టర్ బెడ్రూమ్లో చేయవద్దు. ఆగ్నేయం పడక గదిలో గానీ, వాయవ్యం గదిలో గానీ ఈ ఏర్పాటు చేసుకోవచ్చు. ఇందుకుగాను స్లాబు హైటు కూడా ముందు కనీసం పన్నెండు అడుగులు వేసుకొని ఉంటే.. చాలా సౌకర్యంగా ఉంటుంది. అలాంటి బంకర్ లేదా మెజనైన్ బెడ్లకు చిన్నగా చెక్కమెట్లను ఆ బెడ్‌కు ఆగ్నేయం లేదా వాయవ్యంలో సవ్యంగా అమర్చుకోవాలి. పడకను మాత్రం దక్షిణం లేదా పడమరకు తల వచ్చేలా అమరిక చేసుకోవాలి.
-సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 98492 78143