– కె. జగన్, కపిరాయపల్లి
ఇది చాలామంది మదిలో మెదిలే సందేహమే. దిక్కుమాలిన ఇంటినుంచి మంచి వాస్తు ఉన్న ఇంటికి మారడమే గొప్ప శుభఫలమనే విషయం మరువకూడదు. జీవితం తప్పకుండా మలుపు తిరుగుతుంది.. కానీ, అది జన్మస్థానం నుంచి కదిలి గమ్యస్థానం వైపు అడుగు పడినప్పుడే! వ్యక్తి వైభవం.. అతని వ్యక్తిత్వమే ఇస్తుంది. ఆలోచన బీజాలు పడ్డచోటు ఎంతో గొప్పది. ఆ స్పందన, ఆ కదలిక మీద.. ఆ స్థానం, ఆ పరిసరాలు, అక్కడి వాతావరణం ఎంతో ప్రేరణ కల్పిస్తాయి. కన్యాకుమారిలో బంగాళాఖాతం ఎదురుగా ఉన్న ఒక రాతిగుట్టమీద కూర్చొని.. ఈ సమాజానికి, ఈ ప్రపంచానికి ఒక నిర్దిష్టమైన దారి చూపాల్సిన అవసరం ఉందని అనుకున్నాడు. ‘లేవండి.. మేల్కోండి!’ అంటూ విశ్వ వివేకానందగా వెలిగాడు.. ఒక సాధారణ నరేంద్రుడు. బోధి వృక్షం కింద బుద్ధుడు కూడా అంతే. ఇలా ఎందరో! ఎక్కడ ఏ విత్తనం ఎంత గొప్పగా ఎదుగుతుందో.. అక్కడి మట్టి, ఆ విత్తనం నాణ్యత నిర్ణయిస్తాయి. అలా మహోన్నత స్థలానికి చేరాకే చాలామంది శక్తిమంతులుగా వెలిగారు. చరిత్ర సృష్టించారు. ఆ సమయం.. ఆయా స్థలాలను బట్టి, నిర్మాణాన్ని బట్టి ఉంటుంది. కాలం తక్కువ కావచ్చు. ఎక్కువ కావచ్చు. కానీ, వైభవం మాత్రం తప్పక ఉంటుంది.
– డి. సత్యశీల, ఉప్పల్
దీపాలు ఎక్కువ ఉన్నాయంటే.. ఆయా నగరాలలో ఇండ్లు కిక్కిరిసి ఉన్నాయని అర్థం. ఒకప్పుడు పల్లెటూర్లలో దూరందూరంగా ఇండ్లు కట్టుకునేవాళ్లు. ఎంతో విశాలమైన స్థలాల్లో.. చక్కగా వాస్తు పాటిస్తూ, పారు చూస్తూ, వీధులు చూస్తూ శాస్త్ర ప్రకారం కట్టేవారు. పట్టణాల్లో ఎక్కువ స్థలాలు లేక.. ఇరుకు సందుల్లో ఇరుకు ఇండ్లు కడుతున్నారు. ఒకరి ఇంట్లోకి మరొకరి బాల్కనీలు వచ్చేలా నిర్మిస్తున్నారు. అందుకే.. ‘వేయి దీపాలు ఉన్నచోట వాస్తు ఉండదు’ అన్నారు. అంటే, వాస్తుకు అవకాశం లేని వికృతమైన సముదాయాలు ఉండేచోటు అని అర్థం. అంతేకానీ, ‘వాస్తు పాటించవద్దు’ అని కాదు.
– ఎం. బిందు, జీడికల్
వాస్తులో నిర్మాణం, రూపం చాలా ప్రధానం. ప్రకృతి శక్తి.. వస్తువు ఆధారంగా వ్యక్తమవుతుంది. మంటలో ఒక కర్ర పెడితే దాని ఒక చివర కాలుతున్నా.. పట్టుకున్న మరో చివర మాత్రం కాలదు. అదే ఒక రాగి కడ్డీ పెడితే.. దానిని పట్టుకున్న మరో చివర కూడా కాలుతుంది. అలానే నిర్మాణ వక్రతలు ప్రకృతి శక్తిని నెగెటివ్‌గా, శాస్త్ర పద్ధతి నిర్మాణం ప్రకృతిని పాజిటివ్‌గా మారుస్తుంది. కాబట్టి, ఇంటికి శాస్త్రం భూతద్దంలా పనిచేస్తుంది. బ్యాగ్ జిప్ ఒకవైపు లాగితే క్లోజ్.. మరోవైపు లాగితే ఓపెన్ అయినట్టు ఉంటుంది నిర్మాణ వైభవం. కాబట్టి, ఎట్టి పరిస్థితుల్లోనూ.. ఎక్స్ (ఇంగ్లిష్ అక్షరం), ప్లస్ ఆకారం నిర్మాణాలు వ్యాపారపరంగా కూడా యోగించవు. కొందరు పైనుంచి చూస్తే గొప్పగా, చిత్రంగా కనిపించాలని గద్ద ఆకారంగా, స్వస్తిక్ ఆకారంగా కడుతుంటారు. అవి నిర్మాణాలకు వర్తించవు. వాటి ప్రయోజనం వేరేవిధంగా ఉంటుంది.
– కె. శకుంతల, మక్తల్
లేదు. చాలామంది ఇంటికి, స్థలానికి రొడ్డు తగిలింది అనగానే.. అదేదో చెడ్డది, అరిష్టం, భయానకం అనుకుంటారు. కానీ, అది తప్పు. ఇంటికి ఏచోట పడింది.. ఎక్కడినుంచి వస్తుంది.. దాని మార్గం, దిశ, ఎన్నో కోణాలలో దానిని చూసి, కొలిచి అప్పడు ఆ మార్గం శుభకరమా? వినాశకరమా? అన్నది నిర్ధారించాలి. ఊరికే ఆగమాగం కావద్దు. రోడ్డు ఏ చోటునుంచి వచ్చినా.. అది పడేచోటు సరిగ్గా చూసి మన గృహానికి దక్షిణం మధ్య, దక్షిణ నైరుతి, పశ్చిమ నైరుతి – పశ్చిమం, ఉత్తర వాయవ్యం, తూర్పు ఆగ్నేయం – ఆగ్నేయంలో కోణంగా.. నైరుతిలో కోణంగా (అంటే.. మూలమీద) వాయవ్యంలో కోణంగా రోడ్లు వచ్చి తాకినట్టయితే.. అవి తీవ్రమైన ఇబ్బందులకు గురిచేస్తాయి. ఇక తూర్పు, ఉత్తర ఈశాన్యాలు, సరిగ్గా తూర్పు మధ్య, ఉత్తరం మధ్య, దక్షిణ ఆగ్నేయం, పశ్చిమ వాయవ్యం మంచి స్థానాలు. ఉచ్ఛమైన ఆ దిశల్లో వీధులు వస్తున్నట్టయితే.. అవి శుభ ఫలితాలు ఇస్తాయి. వీటిని వీధి చూపులు అంటారు. మిగతా వాటిని వీధిపోట్లు అంటారు. కానీ, ఏ రోడ్డు తగిలినా.. దోషం అనుకోవద్దు. సరిగ్గా చూసుకోవాలి.
మీ ప్రశ్నలు పంపాల్సిన చిరునామా
‘బతుకమ్మ’, నమస్తే తెలంగాణ దినపత్రిక,
ఇంటి.నం: 8-2-603/1/7,8,9, కృష్ణాపురం.
రోడ్ నం: 10, బంజారాహిల్స్, హైదరాబాద్ – 500034.
– సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 7993467678
Vasthu Shastra | గుడిలేని ఊరిలో ఇల్లు ఉండకూడదా?
Vasthu Tips | ఇంట్లో సీతారాముల ఫొటోలు పెట్టొద్దు అంటున్నారు. నిజమా?
Vasthu Shastra | టెర్రస్ మీద కిచెన్ కట్టుకోవచ్చా? కడితే.. ఎటువైపు కట్టాలి?