వాషింగ్టన్: ఒక మహిళ అమెజాన్‌లో కుర్చీని ఆర్డర్ చేసింది. అయితే పార్సిల్లో దానితో పాటు అందుకున్న మరో వస్తువును చూసి ఆమె షాక్ అయ్యింది. అమెరికాలోని నూయార్క్‌లో ఈ సంఘటన జరిగింది. ఇతాకా ప్రాంతంలో నివసించే 29 ఏళ్ల జెన్ బెగాకిస్ ఇటీవల అమెజాన్‌లో చిన్నపాటి లెదర్ చైర్‌ను ఆర్డర్ చేసింది. అయితే ఆమె అందుకున్న బాక్సులో ఆ చైర్తోపాటు రక్తం ఉన్న వైల్ కూడా ఉంది. ఇది చూసి ఆమె ఆందోళన చెందింది. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతాలో ఆమె వెల్లడించింది. పార్సిల్ చూసి భయాందోళన చెందడంతోపాటు అయోమయానికి గురైనట్లు తెలిపింది. దీనికి సంబంధించిన ఒక వీడియోను కూడా పోస్ట్ చేసింది. సేకరించిన రక్తంతో కూడిన ఒక గాజు ట్యూబ్ ఆ బాక్స్‌లో ఉంది.
కాగా, ఈ విషయాన్ని అమెజాన్ దృష్టికి తీసుకెళ్లినట్లు జెన్ తెలిపింది. తొలుత దీనిపై స్పందించిన ఆ సంస్థ అనంతరం మౌనం వహించినట్లు చెప్పింది. దీంతో రక్తంతో కూడిన వైల్ను ఆ బాక్సులో ఎలా ఎక్కడ ఉందో అక్కడే జాగ్రత్తగా ఉంచినట్లు వెల్లడించింది. కొంత శాంతి, నిశ్శబ్దం కోసం ఆ పెట్టెను మూసివేసినట్లు పేర్కొంది. మరోవైపు జెన్ ట్వీట్‌పై నెటిజన్లు పలు విధాలుగా స్పందించారు.
i’m as terrified as i am confused 🫣 pic.twitter.com/0tSvkqK1Oo
— Jen Begakis (@jenbegakis) June 16, 2022