చిలుకల్లో రెండు రకాలుంటాయి. ఆకుపచ్చ రంగు చిలుకలు, తెల్ల చిలుకలు. ఆకుపచ్చ రంగు చిలుకలను రోజ్ రింగ్డ్ పారాకీట్స్ అని పిలిస్తే.. తెల్లరంగు చిలుకలను వైట్ కాకాటూ అంటారు. తెల్లరంగు చిలుకలు చాలా తెలివైనవి. ఇవి మనుషులతో మాట్లాడుతాయి. మనం అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతుంటాయి. కాగా, ఓ తెల్లరంగు చిలుక నట్బోల్టును నాలుకతో విప్పి ఆశ్చర్యపరిచింది. ఈ వీడియో ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది.
ఈ వీడియోను ట్విటర్లో ‘ది ఫిగెన్’ అనే యూజర్ షేర్ చేశారు. ఇందులో తెల్ల చిలుక తన నల్లని నాలుకతో నట్బోల్టును తిప్పుతూ ఉంటుంది. బోల్టు వచ్చేదాకా అలా తిప్పుతూనే ఉంటుంది. చివరికి నట్టునుంచి బోల్టును వేరుచేస్తుంది. ఈ వీడియోకు ఇప్పటివరకూ 214 వ్యూస్ వచ్చాయి. 6,700మంది లైక్ చేశారు. తెల్ల చిలుక నట్బోల్టును చాకచక్యంగా విప్పడం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
Amazing! 😂pic.twitter.com/W5xiGBypUS
— Figen (@TheFigen) April 14, 2022