Sudha Murty | శ్రేయా ఘోషాల్ పాటకు డాన్స్ చేసిన సుధా మూర్తి.. వైరల్ అవుతున్న వీడియో
నారాయణ మూర్తి మరో ఆరుగురు కలిసి 1981లో ఇన్ఫోసిస్‌ను ప్రారంభించారు
Sudha Murty : ఇన్ఫోసిస్ సంస్థ ఛైర్ పర్సన్ సుధా మూర్తి డాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బాలీవుడ్ సింగర్ శ్రేయా ఘోషాల్ హిందీ పాట పాడుతుంటే సుధా గొంతు కలపడమే కాకుండా హుషారుగా స్పెప్పులేశారు. బెంగళూరులో జరుగుతున్న ఇన్ఫోసిస్ 40వ వార్షికోత్సవం వేడుకల్లో ఈ సంఘటన జరిగింది. శ్రేయా, సుధామూర్తి కోసం డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన గురు సినిమలోని ‘బర్సో రే మేఘా మేఘా’ పాట పాడింది. తనకు ఇష్టమైన పాట కావడంతో సుధా కూడా పాట పాడుతూ డాన్స్ చేసింది. దాంతో, పక్కన ఉన్నవాళ్లు చప్పట్లు కొడుతూ ఆమెను ఉత్సాహపరిచారు.
ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయుణ మూర్తి భార్య అయిన సుధా మూర్తి రచయితగా, సామాజిక స్పృహ ఉన్న వ్యక్తిగా చాలా పాపులర్. తన రచనల ద్వారా ఆమె యువతలో చైతన్యాన్ని నింపుతున్నారు. సుధా మూర్తి రాసిన వైజ్ అండ్ అదర్వైజ్, గ్రాండ్మాస్ బ్యాగ్ ఆఫ్ స్టోరీస్, ది మ్యాజిక్ ఆఫ్ ది లాస్ట్ టెంపుల్ వంటి పుస్తకాలు చాలా ఫేమస్. అంతేకాదు సుధా మూర్తి చాలా అనాథాశ్రమాలను కూడా నెలకొల్పారు. నారాయణ మూర్తి మరో ఆరుగురు కలిసి 1981లో ఇన్ఫోసిస్‌ను ప్రారంభించారు. ఈ కంపెనీని నారాయణ మూర్తి దంపతులు తమ నడిపి బిడ్డ అని ముద్దుగా పిలుచుకుంటారు. వీళ్లకు అక్షత, రోహన్ అనే సంతానం ఉన్నారు.
Someone just sent this to me. Sudha Murty dancing and singing with @shreyaghoshal as part of the #Infy4Decades celebration in Bengaluru last night. Wholesome 😍 pic.twitter.com/I17Ns49qDR
— Chandra R. Srikanth (@chandrarsrikant) December 15, 2022
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kodangal | కొడంగల్‌లో కేజీబీవీ భవనంపై నుంచి పడి విద్యార్థినికి తీవ్ర గాయాలు.. సమాచారాన్ని గోప్యంగా ఉంచిన అధికారులు
Netflix | ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చేసిన క్రేజీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు!
Pony Verma | రాజకీయల వల్లే ప్రకాశ్‌రాజ్‌ని సినిమాల నుంచి తొలగించారు: పోని వర్మ
Harish rao | నో పబ్లిక్ ఇంట్రెస్ట్.. ఓన్లీ ప్రైవేట్ ఇంట్రెస్ట్.. సీఎం రేవంత్ సర్కార్ గెజిట్‌పై హరీశ్ రావు
White Noise Machine | నిద్రలేమి సమస్యను తగ్గించే వైట్ నాయిస్ యంత్రం.. అసలేమిటిది.. ఎలా పనిచేస్తుంది..?
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

