e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 24, 2021
Home ట్రెండింగ్‌ మీ ఫేస్‌బుక్ ఖాతా సుర‌క్షిత‌మేనా? మీ ప్రొఫైల్‌ని ఇలా సేఫ్‌గా మార్చుకోండి

మీ ఫేస్‌బుక్ ఖాతా సుర‌క్షిత‌మేనా? మీ ప్రొఫైల్‌ని ఇలా సేఫ్‌గా మార్చుకోండి

మీ ఫేస్‌బుక్ ఖాతా సుర‌క్షిత‌మేనా? మీ ప్రొఫైల్‌ని ఇలా సేఫ్‌గా మార్చుకోండి

ఇవాల్టి రోజుల్లో చాలామంది సోష‌ల్ మీడియాను వినియోగిస్తున్నారు. త‌మ జీవితంలో ఏం జ‌రిగినా వాటిని ఫేస్‌బుక్‌లో పంచుకుంటున్నారు. కొత్త స్నేహితుల‌ను ప‌రిచ‌యం చేసుకుంటున్నారు. ట్రెండ్‌కి త‌గ్గ‌ట్టు మార‌డం.. టెక్నాల‌జీకి అప్‌డేట్ కావ‌డం వ‌ర‌కు బాగానే ఉంది.. కానీ దాన్ని ఎంత జాగ్ర‌త్త‌గా వాడుతున్నామ‌నేది కూడా చూసుకోవాలి. ఆన్‌లైన్ మోజులో ప‌డి పాటించాల్సిన కొన్ని జాగ్ర‌త్త‌లు పాటించ‌క‌పోతే సైబ‌ర్ మోస‌గాళ్ల చేతిలో బ‌ల‌వ్వాల్సి వ‌స్తుంది. కాబ‌ట్టి సైబ‌ర్ మోస‌గాళ్ల బారిన ప‌డ‌కుండా ఉండేందుకు మ‌న ఫేస్‌బుక్ ఖాతాను సుర‌క్షితంగా మార్చుకోవ‌డం ఎంతో అవ‌స‌రం.

టూ ఫ్యాక్ట‌ర్‌ అథెంటికేష‌న్

మ‌న ఫేస్‌బుక్ ఖాతాను సుర‌క్షితంగా ఉంచుకోవ‌డం కోసం టూ ఫ్యాక్ట‌ర్‌ అథెంటికేష‌న్ యాక్టివేట్ చేసుకోవ‌డంచాలా అవ‌స‌రం. దీనివ‌ల్ల మ‌న పాస్‌వ‌ర్డ్ వేరే వాళ్ల‌కు తెలిసిన‌ప్ప‌టికీ అంత సులువుగా మ‌న ఖాతాలోకి లాగిన్ అవ్వ‌లేరు. అలాగే మ‌న‌కు తెలియ‌కుండా వేరే బ్రౌజ‌ర్‌లో గానీ, మొబైల్‌లో గానీ మ‌న అకౌంట్ లాగిన్ అయితే.. మ‌న మెయిల్ ఐడీకి వెంట‌నే ఒక అలర్ట్ కూడా వ‌స్తుంది. దీనివ‌ల్ల వెంట‌నే అప్ర‌మ‌త్త‌మై మ‌న ఖాతాను సుర‌క్షితంగా మార్చుకోవ‌చ్చు. దీనికోసం ప్రైవ‌సీ సెట్టింగ్స్‌లోకి వెళ్లి అన్ రిక‌గ్నైజ్‌డ్ లాగిన్ అల‌ర్ట్స్ కూడా యాక్టివేట్ చేసుకోవాలి.

ప్రొఫైల్ లాక్

ఈ ఫీచ‌ర్‌ను యాక్టివేట్ చేసుకోవ‌డం ద్వారా ఇత‌రులు మ‌న ప్రొఫైల్‌లోని వివ‌రాల‌ను ఇత‌రులు చూడ‌లేరు. మీ టైంలైన్‌లోని పోస్టులు, ఫొటోలు మీ స్నేహితుల‌కు త‌ప్ప‌ ఎవ‌రికీ క‌నిపించ‌వు. ఈ ఫీచ‌ర్ యాక్టివేట్ చేసుకుంటే మీ స్నేహితుల స్నేహితులు కూడా మీ టైంలైన్‌లోని ఫొటోలు, పోస్టులు చూడ‌లేరు.

టైం లైన్ ఎవ‌రు చూడ‌లో ఎంపిక చేసుకోవ‌డం

సాధార‌ణంగా ఫేస్‌బుక్ టైంలైన్‌లో ఏది షేర్ చేసినా అంద‌రికీ క‌నిపిస్తుంది. అందుకే మ‌నం ఏదైనా పోస్ట్ చేసేముందు ఆ పోస్ట్‌ను ఎవ‌రు చూడాలో సెలెక్ట్ చేసుకోవ‌డం కూడా ముఖ్య‌మే. మీ టైం లైన్‌లోని పోస్టులు, ఫొటోలు అంద‌రూ చూడ‌కుండా సెట్టింగ్స్ మార్చుకోవాలి. కేవ‌లం స్నేహితులే మీ పోస్టులు చూడాలా.. స్నేహితుల స్నేహితులు కూడా మీ పోస్టులు చూడాలా అనేది ఎంచుకోవ‌చ్చు. అంతెందుకు క‌స్ట‌మైజ్‌డ్ ఫీచ‌ర్ ద్వారా మీకు న‌చ్చిన కొంత‌మందికి మాత్ర‌మే మీ ప్రొఫైల్ క‌నిపించేలా కూడా సెట్టింగ్స్ మార్చుకోవ‌చ్చు

టైం లైన్ రివ్యూ

సాధార‌ణంగా మ‌న ఫ్రెండ్స్ పోస్టులు చేసిన‌ప్పుడు మ‌న‌ల్ని ట్యాగ్ చేస్తుంటారు. దీనివ‌ల్ల మ‌న టైంలైన్‌లోకి కుప్ప‌లు తెప్ప‌లుగా పోస్టులు వ‌చ్చి చేరుతుంటాయి.  అయితే మీ స్నేహితులు ట్యాగ్ చేసిన పోస్టులు.. నేరుగా మీ టైంలైన్‌లోకి రాకూడ‌దంటే టైం లైన్ రివ్యూ ఫీచ‌ర్‌ను యాక్టివేట్ చేసుకోవ‌డం ఉత్త‌మం. దీనివ‌ల్ల  ఏ పోస్టులు మ‌న టైం లైన్‌పై ఏ పోస్టులు క‌నిపించాలో మ‌న‌మే సెలెక్ట్ చేసుకోవ‌చ్చు. న‌చ్చ‌నివి డిలీట్ చేయొచ్చు.

మేనేజ్ యాక్టివిటీ

మేనేజ్ యాక్టివిటీ ఫీచ‌ర్ ద్వారా పాత పోస్టుల‌ను ఆర్కివ్‌లోకి పంపించొచ్చు.. లేదా డిలీట్ చేయొచ్చు.  పోస్టుల‌ను డిలీట్ చేసిన‌ప్పుడు అవి ట్రాష్‌లోకి వెళ్తాయి. అక్క‌డ 30 రోజుల‌కు ఆ పోస్టులు ఉంటాయి. ఈ 30రోజుల లోపు అవ‌స‌ర‌మైతే ఆ పోస్టుల‌ను రీస్టోర్ చేసుకోవ‌చ్చు. లేదంటే వెంట‌నే ట్రాష్‌లో నుంచి కూడా డిలీట్ చేయ‌వ‌చ్చు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
మీ ఫేస్‌బుక్ ఖాతా సుర‌క్షిత‌మేనా? మీ ప్రొఫైల్‌ని ఇలా సేఫ్‌గా మార్చుకోండి

ట్రెండింగ్‌

Advertisement