ఉద్యోగులు మధ్యాహ్నం ఓ కునుకు తీయొచ్చు..బెంగళూరు స్టార్టప్ కంపెనీ వినూత్న నిర్ణయం..!!
ఉద్యోగులంటే చాలా కంపెనీలకు చిన్నచూపే. ఎప్పుడూ వారితో పనిచేయించుకోవాలని చూస్తుంటాయి. అలసిపోయి పనివేళలో ఓ కునుకు తీస్తే ఇక అంతే. బాస్ పిలిచి చీవాట్లు పెడుతుంటాడు. అయితే, బెంగళూరుకు చెందిన ఓ స్టార్టప్ కంపెనీ ఉద్యోగులకు అనుకూలంగా ఓ వినూత్న నిర్ణయం తీసుకుంది. మధ్యాహ్నంపూట ఓ అరగంట కునుకు తీసేలా అనుమతిచ్చింది. ఈ మేరకు ఉద్యోగులకు మెయిల్స్ కూడా పంపింది.
ఉద్యోగులంటే చాలా కంపెనీలకు చిన్నచూపే. ఎప్పుడూ వారితో పనిచేయించుకోవాలని చూస్తుంటాయి. అలసిపోయి పనివేళలో ఓ కునుకు తీస్తే ఇక అంతే. బాస్ పిలిచి చీవాట్లు పెడుతుంటాడు. అయితే, బెంగళూరుకు చెందిన ఓ స్టార్టప్ కంపెనీ ఉద్యోగులకు అనుకూలంగా ఓ వినూత్న నిర్ణయం తీసుకుంది. మధ్యాహ్నంపూట ఓ అరగంట కునుకు తీసేలా అనుమతిచ్చింది. ఈ మేరకు ఉద్యోగులకు మెయిల్స్ కూడా పంపింది.
వేక్‌ఫిట్ అనే పరుపుల తయారీ కంపెనీ ఈ వినూత్న నిర్ణయం తీసుకుంది. తాము ఆరేళ్లుగా ఈ వ్యాపారంలో ఉన్నా ఉద్యోగుల అవసరాన్ని గుర్తించలేకపోయామని, అందుకే ఇప్పుడు ఉద్యోగులకు పనివేళ మధ్యలో ఓ కునుకు తీసే అవకాశమిస్తున్నామని కంపెనీ కో ఫౌండర్ చైతన్య రామలింగెగౌడ అంటున్నారు. పనిమధ్యలో 26 నిమిషాలపాటు కునుకు తీస్తే పనిచేసే సామర్థ్యం 33 శాతం పెరుగుతుందని హార్వర్డ్ యూనివర్సిటీ, నాసా అధ్యయనంలో తేలిందన్నారు.
ఇందుకనుగుణంగానే తమ ఉద్యోగుల సామర్థ్యం పెంచేందుకు ప్రతిరోజూ మధ్యాహ్నం 2.00 గంటల ఉంచి 2.30 గంటలకు వరకు నిద్రపోయే అవకాశం ఇస్తున్నట్లు రామలింగెగౌడ తెలిపారు. ఈ సమయంలో ఉద్యోగులకు ఎలాంటి పని చెప్పబోమన్నారు. కాగా, వేక్‌ఫిట్ తీసుకున్న నిర్ణయంపై నెటిజన్లనుంచి మంచి స్పందన వస్తోంది. మార్కెట్లో కొత్త ట్రెండ్ సెట్ చేయబోతున్నారంటూ వేక్‌ఫిట్ యాజమాన్యాన్ని అభినందిస్తున్నారు.
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nepal Falsh Floods | నేపాల్‌లో మళ్లీ అకస్మిక వరద.. నేలమట్టమైన ఇళ్లు, బ్రిడ్జిలు..!
Digital arrest | డిజిటల్ అరెస్ట్ వలలో చిక్కి యువతి విలవిల.. రూ.2.5 లక్షలు పోగొట్టుకుని ఆత్మహత్య..!
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

