Viral video: నాకు నువ్వు.. నీకు నేను..ఈ బాలిక, వృద్ధురాలి స్నేహం ప్రత్యేకం..!!
ఒకే ఏజ్‌గ్రూప్‌లో డౌన్ సిండ్రోమ్ ఉన్నవాళ్లు ఉండడం కష్టం. అందుకే డౌన్ సిండ్రోమ్‌తో బాధపడుతున్న ఓ బాలిక అదే వ్యాధితో బాధపడుతున్న 95 ఏళ్ల వృద్ధురాలితో స్నేహం చేస్తోంది. వీళ్లిద్దరి మధ్య ప్రత్యేక బంధం ఏర్పడింది.
డౌన్ సిండ్రోమ్ లేదా డౌన్స్ సిండ్రోమ్ (Down syndrome) ఒక విధమైన జన్యు సంబంధమైన వ్యాధి. ఈ వ్యాధిగ్రస్తులలో క్రోమోజోము 21 (chromosome 21) లో రెండు ఉండాల్సిన పోగులు మూడు వుంటాయి. అందువలన దీనిని ట్రైసోమీ 21 అని కూడా పిలుస్తారు. దీనితో బాధపడుతున్నవారిలో భౌతికమైన పెరుగుదల మందగిస్తుంది. వీరిని ముఖంలోని మార్పుల ఆధారంగా గుర్తించవచ్చు. వీరికి తెలివితేటలు చాలా తక్కువగా వుంటాయి. వీళ్లపై అధిక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. డౌన్‌సిండ్రోమ్ ఉన్న మరో మనిషితో ప్రత్యేక బంధం కచ్చితంగా ఉండాలి. అయితే, ఒకే ఏజ్‌గ్రూప్‌లో డౌన్ సిండ్రోమ్ ఉన్నవాళ్లు ఉండడం కష్టం. అందుకే డౌన్ సిండ్రోమ్‌తో బాధపడుతున్న ఓ బాలిక అదే వ్యాధితో బాధపడుతున్న 95 ఏళ్ల వృద్ధురాలితో స్నేహం చేస్తోంది. వీళ్లిద్దరి మధ్య ప్రత్యేక బంధం ఏర్పడింది.
వియన్నా అనే బాలిక డౌన్ సిండ్రోమ్ వ్యాధితో బాధపడుతోంది. పక్కనే ఉన్న 95 ఏళ్ల థెరిసా అనే వృద్ధురాలికి కూడా డౌన్‌సిండ్రోమ్ వ్యాధి ఉంది. వీళ్లిద్దరూ ప్రతిరోజూ కలుసుకుంటారు. కలవగానే ప్రేమగా ఆలింగనం చేసుకుంటారు. ఒకేచోట చాలాసేపు గడుపుతారు. కాగా, వియన్నా దినచర్యను ఆమె తల్లి వీడియో తీస్తూ ఉంటుంది. ఓ వీడియోను సోషల్‌మీడియాలో పెట్టగా, వైరల్ అవుతున్నది. వియన్నా, థెరిసా మధ్య ప్రేమను చూసి నెటిజన్లు చలించిపోతున్నారు.
Read Today's Latest Trending News in Telugu and Telugu News
- Tags
- down syndrome
- trending
- UK
- US
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | వచ్చే ఏడాది దీపావళికి ‘స్పిరిట్’
Dasara Property Sales | దసరా సందడి నిల్.. అమ్మకాలు, లాంచింగ్ లేక వ్యాపారం దివాళా
Crazy Kalyanam | రివార్డులతోపాటు అవార్డులూ సాధించే సినిమా
Tiger Shroff | టైగర్ష్రాఫ్పై కాల్పులు.. తీవ్రంగా గాయపడిన డ్రైవర్
France Protests | ఫ్రాన్స్ అగ్నిగుండం.. భవనాలకు నిప్పు, దుకాణాలు లూటీ.. హింసాత్మకంగా మారిన నిరసనలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

