Mumbai Local Train | ట్రైన్లో ప్రయాణికుల మధ్య గొడవలు సర్వసాధారణమైపోయాయి. ఇటీవలే ఢిల్లీ మెట్రో రైలులో కొందరు ప్రయాణికులు తరచూ ఘర్షణపడుతున్న వీడియోలు ఇప్పటికే నెట్టింట తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ గొడవలు ముంబై లోకల్ ట్రైన్ (Mumbai Local Train)ను తాకాయి.
లోకల్ ట్రైన్స్ ఎంత రద్దీగా ఉంటాయో చెప్పాల్సిన పనిలేదు. కాలుతీసి కాలుపెట్టేకి ఉండదు. ఇసుకేస్తే రాలనంత జనం నిత్యం లోకల్ ట్రైన్లో ప్రయాణిస్తుంటారు. తాజాగా రద్దీగా ఉన్న లోకల్ ట్రైన్లో ఇద్దరు ప్రయాణికులు మధ్య గొడవ చోటు చేసుకుంది. అది కొద్దిసేపటికే తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఒకరినొకరు కొట్టుకుంటూ దూషించుకోవడం మొదలు పెట్టారు. ఇంతలో తోటి ప్రయాణికుడు కలుగజేసుకుని వారిద్దరి మధ్య గొడవను సద్దుమణిగేలా చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ముంబై మ్యాటర్స్ ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. ‘రద్దీగా ఉండే ముంబై లోకల్ ట్రైన్లో ఒక సాధారణ రోజువారీ దృశ్యం..’ అని వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఇది వైరల్ అవుతోంది.
Just a Normal daily scene inside a crowded #MumbaiLocal
Loved the Super Cool Referee.. pic.twitter.com/i0X9yAperP
— मुंबई Matters™ (@mumbaimatterz) September 1, 2023
Also Read..
Uday Kotak | కోటక్ మహీంద్రా బ్యాంక్ సీఈవో ఉదయ్ కోటక్ రాజీనామా
Joe Biden | జీ20 సమ్మిట్‌కు రెండు రోజుల ముందే భారత్ రానున్న బైడెన్.. 8న ప్రధానితో ప్రత్యేక భేటీ
Nitish Kumar | ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ముందస్తు లోక్‌సభ ఎన్నికలకు నాంది: నితీశ్ కుమార్