Uday Kotak | కోటక్ మహీంద్రా బ్యాంక్ సీఈవో ఉదయ్ కోటక్ రాజీనామా
Uday Kotak | దేశంలోని టాప్ ప్రైవేటు బ్యాంకుల్లో ఒకటిగా ఉన్న కోటక్ మహీంద్రా బ్యాంక్ (Kotak Mahindra Bank) సీఈవో ఉదయ్ కోటక్ (Uday Kotak) తన పదవికి రాజీనామా (Resigns) చేశారు.
Uday Kotak | దేశంలోని టాప్ ప్రైవేటు బ్యాంకుల్లో ఒకటిగా ఉన్న కోటక్ మహీంద్రా బ్యాంక్ (Kotak Mahindra Bank) సీఈవో ఉదయ్ కోటక్ (Uday Kotak) తన పదవికి రాజీనామా (Resigns) చేశారు. సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ పదవుల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.
అయితే, ఆయన పదవీ కాలం ఈ ఏడాది డిసెంబర్ చివరికి ముగియనుంది. ఇంతలోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. రాజీనామాకు సంబంధించిన లేఖను ఉదయ్ కోటక్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. ‘వ్యవస్థాపకుడిగా నేను కోటక్ బ్రాండ్‌తో చాలా అనుబంధాన్ని కలిగి ఉన్నాను. సంస్థకు నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ముఖ్యమైన వాటాదారుగా సేవలను కొనసాగిస్తాను. వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మా వద్ద అత్యుత్తమ నిర్వహణ బృందం ఉంది. వ్యవస్థాపకులు వెళ్లిపోయినా.. సంస్థ శాశ్వతంగా ముందుకు కొనసాగుతుంది’ అని ఆయన పేర్కొన్నారు.
జేపీ మోర్గాన్, గోల్డ్‌మన్ సాక్స్ వంటి సంస్థలు ప్రపంచంలో ఆధిపత్యాన్ని చెలాయించటం చూశానని ఆయన తెలిపారు.దేశంలో గొప్ప ఆర్థిక సంస్థను సృష్టించాలనే కలతోనే తాను 38 సంవత్సరాల క్రితం కోటక్ మహీంద్రా బ్యాంక్‌ను ప్రారంభించినట్లు చెప్పారు. ముంబైలోని ఫోర్ట్‌లో 300 చదరపు అడుగుల కార్యాలయంలో కేవలం ముగ్గురు ఉద్యోగులతో తాను ఈ సంస్థను ప్రారంభించినట్లు ఉదయ్ కోటక్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
My letter is attached pic.twitter.com/vcSIEcvy2r
— Uday Kotak (@udaykotak) September 2, 2023
Also Read..
Joe Biden | జీ20 సమ్మిట్‌కు రెండు రోజుల ముందే భారత్ రానున్న బైడెన్.. 8న ప్రధానితో ప్రత్యేక భేటీ
Nitish Kumar | ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ముందస్తు లోక్‌సభ ఎన్నికలకు నాంది: నితీశ్ కుమార్
Elon Musk | నా కుమార్తెతో విభేదాలు నన్నెంతో బాధించాయి : ఎలాన్ మస్క్
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

