Elon Musk | నా కుమార్తెతో విభేదాలు నన్నెంతో బాధించాయి : ఎలాన్ మస్క్
Elon Musk | ఎలాన్ మస్క్ (Elon Musk).. ప్రపంచంలో ఈ పేరు తెలియని వారు ఉండరు. టెస్లా సీఈవో, ట్విట్టర్ బాస్ అయిన మస్క్ ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు. అయితే, మస్క్ తన కూతురు విషయంలో ఎంతో బాధపడ్డాడట. ఆమెతో విభేదాలు తనను ఎంతో బాధించాని తెలిపాడు.
Elon Musk | ఎలాన్ మస్క్ (Elon Musk).. ప్రపంచంలో ఈ పేరు తెలియని వారు ఉండరు. టెస్లా సీఈవో, ట్విట్టర్ బాస్ అయిన మస్క్ ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు. ఇటీవలే ట్విట్టర్‌ను టేకోవర్ చేసినప్పటి నుంచి మస్క్ తరచూ వార్తల్లో నిలుస్తూ ఉన్నారు. అయితే, ఎప్పుడూ విమర్శలు, ప్రతివిమర్శలతో హెడ్‌లైన్స్‌లో నిలిచే మస్క్ జీవితంలో ఎన్నో విషాద ఘటనలు కూడా ఉన్నాయి. నాణేనికి రెండు వైపులా అన్నట్లే మనిషి జీవితం కూడా. పైకి నవ్వుతూ సరదాగా ఉన్నవారంతా సంతోషంగా ఉన్నట్లు కాదు. లోపల ఎన్నో బాధలు అనుభవిస్తుంటారు. ఎన్నో విషాద ఘటనలు చూసుంటారు. మస్క్ జీవితంలో కూడా కొన్ని బాధాకరమైన ఘటనలు చోటు చేసున్నాయి. అందులో ముఖ్యమైనది తన కూతురికి సంబంధించిన విషయం ఒకటి ఉంది.
మస్క్ కుమారుడు జేవియర్ పేరు వినే ఉంటారు. పుట్టుకతో పురుషుడిగా పుట్టిన జేవియర్ ఆ తర్వాత 18 ఏళ్లు నిండాకా అమ్మాయిగా తన లింగాన్ని మార్చుకున్నారు. అంతేకాదు తనకు తండ్రితో ఎలాంటి సంబంధం ఉండకూడదని చట్టపరంగా తన పేరును కూడా మార్చకుంది. గతేడాది తన తండ్రితో కానీ, ఆయన ఆస్తితో కానీ, ఆయకు సంబంధించిన వేటితో తనకు సంబంధం లేకుండా తన పేరు మార్చుకోవడానికి అనుమతినివ్వాలని కోర్టుకెక్కిన మస్క్ కూతురు తన అసలు పేరు జేవియర్ అలెగ్జాండర్ మస్క్ (Xavier Alexander Musk) తీసేసి వీవియన్గా తన గుర్తింపును మార్చుకుంది. ఆ తర్వాత నుంచి ఆమె మస్క్‌కు దూరంగా ఉంటోంది. అయితే, ఈ విషయం ట్విట్టర్ బాస్‌ను ఎంతో బాధించిందట.
ఎలాన్ మస్క్ జీవిత చరిత్ర ఆధారంగా వాల్టర్ ఐసాక్సన్ (Walter Isaacson) ఓ పుస్తకాన్ని రాశారు. ఆ బుక్ ఈ నెల 12వ తేదీన విడుదల కాబోతోంది. అయితే అందులోని ఓ సారాంశాన్ని ప్రముఖ వార్తా సంస్థ ‘ది వాల్ స్ట్రీట్ జర్నల్’ (The Wall Street Journal) తాజాగా ప్రచురించింది. ఆ కథనం ప్రకారం.. ‘నా కుమార్తె సోషలిజం నుంచి పూర్తిగా కమ్యూనిజం వైపు మళ్లింది. డబ్బున్న ప్రతీ ఒక్కరూ చెడ్డవారని భావించే స్థితికి చేరుకుంది. కన్నబిడ్డతో విబేధాలు నన్నెంతో బాధించాయి. కూతురితో సఖ్యత కోసం ఎన్నిసార్లు ప్రయత్నించినా తను నాతో ఉండేందుకు అంగీకరించలేదు. తొలి సంతానం మరణం తర్వాత ఇంతగా వేదన మిగిల్చింది మరొకటి లేదు’ అని మస్క్ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, తన కూతురు ట్రాన్స్‌జెండర్‌గా మారడానికి కారణం ఆమె చదువుకున్న స్కూలేనని మస్క్ ఆరోపించారు.
2000లో జస్టిస్ విల్సన్‌ను మస్క్ పెళ్లాడాడు. అయితే కొన్ని రోజుల తర్వాత ఇద్దరి మధ్య నెలకొన్న మనస్పర్థల కారణంగా ఆమెకు 2008లో విడాకులు ఇచ్చేశాడు. అయితే ఈ జంటకు ఏడు మంది సంతానం. అందులో జేవియర్ ఒకరు.
Also Read..
Himachal Pradesh | రెండు నెలల్లో వర్షం కారణంగా 400 మంది మృతి : హిమాచల్ మంత్రి
La Tomatina | స్పెయిన్‌లో ఉత్సాహంగా టమాటా ఫెస్టివల్.. వీడియో
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

