Ukraine | రష్యా దాడినేపథ్యంలో బాంబుల మోతతో దద్దరిల్లుతున్న ఉక్రెయిన్‌లో షాకింగ్ ఘటన ఒకటి చోటు చేసుకుంది. ఉక్రెయిన్‌లోని జాతీయ రహదారిపై ఓ హెలికాప్టర్ తక్కువ ఎత్తులో ఎగురుతూ వాహనదారులను భయాందోళనకు గురిచేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖ ట్విటర్లో పోస్టు చేసింది. ‘వెల్కమ్ టు ఉక్రెయిన్’ అని క్యాప్షన్ ఇచ్చింది.
వీడియోలో ఏముందంటే… ఉక్రెయిన్‌లోని ఓ జాతీయ రహదారిపై వాహనాలు వాయు వేగంతో దూసుకెళ్తున్నాయి. అదే సమయంలో ఓ హెలికాప్టర్ తక్కువ ఎత్తులో ఎగురుతూ కారుకు ఎదురుగా వచ్చింది. దాదాపుగా కారును ఢీ కొట్టిందేమో అనుకునేంత దగ్గరగా వచ్చి షాకిచ్చింది. క్రాష్ అయ్యే సమయానికి పైలట్ చాకచక్యంగా హెలికాప్టర్‌ను పక్కకు తప్పించాడు. దీంతో తృటిలో ప్రమాదం తప్పినట్లైంది. ఇందుకు సంబంధించిన దృష్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీడియో చూసిన నెటిజన్లు ఒక్కసారిగా షాక్‌కు గురవుతున్నారు. ‘పైలట్ ఎంతో అనుభవం ఉన్నవాడు కాబట్టి ప్రమాదం జరగకుండా జాగ్రత్తపడ్డాడు..’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
గత కొన్ని నెలలుగా ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఉక్రెయిన్‌లోని ప్రధాన నగరాలపై రష్యా క్షిపణులతో భీకర దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో అనేక మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. కొందరు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్తున్నారు.
Welcome to Ukraine 🇺🇦 pic.twitter.com/LdFhrzwn2m
— Defense of Ukraine (@DefenceU) October 20, 2022