అక్క ఉన్న చెల్లెలు అదృష్టవంతురాలు అని అంటారు..ఈ వీడియో చూస్తే అది నిజం అని నమ్మాల్సిందే. ఓ చెల్లె కోసం అక్క చేసిన త్యాగం నెటిజన్లను ఫిదా చేసింది. ఆ అక్కపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ వీడియో నెట్టింట హల్చల్ సృష్టించింది.
ఈ వీడియోలో చెల్లె సైకిల్ ఎక్కేందుకు ప్రయత్నిస్తుంది. కానీ, ఆమెకు కాళ్లు అందకపోవడంతో ఇబ్బందిపడుతుంది. అక్కడే ఉన్న అక్క కిందకు వంగి చెల్లె సైకిల్ ఎక్కేలా సహకరిస్తుంది. ఇన్స్టాగ్రాంలో ఈ వీడియో పెట్టగా ఇప్పటివరకూ ఆరు మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంది.