కొన్ని పాములు పెద్ద క్షీరదాలను మింగేస్తాయి. వారాలు, నెలల తరబడి ఆహారం తీసుకోకుండా ఉంటాయి. ఈ విషయం మనకు తెలిసిందే. అయితే, కింగ్ కోబ్రాలు పాములను కూడా తింటాయి. ఈ విషయం చాలామందికి తెలియదు. కాగా,ఓ పామును కింగ్‌కోబ్రా అమాంతం మింగేసిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
ఈ వీడియో ఇన్‌స్టాలో స్నేక్ వరల్డ్ పోస్ట్ చేసింది. ఓ విషపూరితమైన నాగుపాము బొరియలో ఉండగా కింగ్‌కోబ్రా దాన్ని పట్టేసుకుంది. అనంతరం మెళ్లగా మింగేసింది. ఈ వీడియోను ఇప్పటివరకూ 42,000 మంది వీక్షించారు.