కోతులు పరిణతి చెందిన జంతువులు. ఇవి చేష్టలలో మానవులను పోలి ఉంటాయి. డార్విన్ జీవపరిణామ సిద్ధాంతం ప్రకారం, మానవులు కోతులనుంచి రూపాంతరం చెందారని అంటారు. అయితే, ఓ కోతి అచ్చు మనిషిలాగా రెండు కాళ్లపై నడుస్తూ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఈ వీడియోలో కోతి వర్షం సినిమాలో ప్రభాస్‌లా చాతీ విరుచుకుని కొంతదూరం నడుచుకుంటూ వెళ్లింది. అనంతరం బ్రిడ్జిపై గెంతుతూ కనిపించింది. ఈ వీడియోను నేచురల్ లైఫ్ ఓకే ఇన్‌స్టాలో పోస్ట్ చేయగా, ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోను 1.8 మిలియన్ వ్యూస్ రావడం విశేషం. చాలామంది ఫ్రెండ్స్‌కు వీడియో ట్యాగ్ చేస్తూ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.