shark | ఫ్లోరిడా (Florida)లోని ఎవర్ గ్లేడ్స్ నేషనల్ పార్క్ (National Everglades Park) లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ పెద్ద షార్క్ (shark).. జాలరి (fisherman ) చేతిని కొరికి అమాంతం నీటిలోకి లాగేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన భయానక దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కొందరు జాలర్లు పడవలో చేపల వేటకు వెళ్లారు. ఈ క్రమంలో ఓ మత్స్యకారుడు తన చేతుల్ని కడుక్కునేందుకు నీటిలోకి పెట్టాడు. ఇంతలోనే నీళ్లలో ఉన్న ఓ పెద్ద షార్క్ ఆ జాలరి చేతిని అమాంతం పట్టుకుని కొరికింది. అంతటితో ఆగకుండా నీటిలోకి లాగేసుకుంది. పక్కనే ఉన్న తోటి జాలర్లు వెంటనే అప్రమత్తమై నీటిలో పడిపోయిన వ్యక్తిని పడవపైకి లాగేసుకున్నారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఈ మొత్తం ఘటనను అక్కడే ఉన్న మరో వ్యక్తి తన కెమెరాలో బంధించాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
Also Read..
Navjot Sidhu | కాబోయే కోడలిని పరిచయం చేసిన నవజ్యోత్ సిద్ధూ.. గంగా నది ఒడ్డున కుమారుడి ఎంగేజ్మెంట్
SS Rajamouli | హాలిడే ట్రిప్ ను ఎంజాయ్ చేస్తున్న రాజమౌళి.. పిక్స్ వైరల్