Mamata Banerjee | దీదీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్.. స్వల్ప గాయాలతో బయటపడ్డ సీఎం
Mamata Banerjee | పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee)కి పెను ప్రమాదం తప్పింది. సీఎం ప్రయాణిస్తున్న హెలికాప్టర్ (chopper) అత్యవసరంగా ల్యాండ్ (emergency landing) అయింది. ఈ ఘటనలో సీఎం స్వల్ప గాయాలతో బయటపడినట్లు సంబంధిత అధికారులు తెలిపారు.
Mamata Banerjee | పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee)కి పెను ప్రమాదం తప్పింది. సీఎం ప్రయాణిస్తున్న హెలికాప్టర్ (chopper) అత్యవసరంగా ల్యాండ్ (emergency landing) అయింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా సిలిగురి సమీపంలోని సెవోక్ ఎయిర్ బేస్ వద్ద ఎమర్జెన్సీ ల్యాండ్ చేయాల్సి వచ్చింది. ఈ ఘటనలో సీఎం స్వల్ప గాయాలతో బయటపడినట్లు సంబంధిత అధికారులు తెలిపారు.
జల్పాయ్గురి జిల్లాలో మంగళవారం జరిగిన బహిరంగ సభకు హాజరైన దీదీ.. అక్కడ ప్రసంగం అనంతరం హెలికాప్టర్ లో బాగ్ డోగ్రా (Bagdogra) బయలుదేరినట్లు టీఎంసీ నేతలు తెలిపారు. దీదీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ బైకుంఠపూర్ అటవీ ప్రాంతం మీదుగా వెళ్తుండగా.. వాతావరణ ప్రతికూలత ఎదురైనట్లు చెప్పారు. వర్షాలకు తోడు లో-విజిబిలిటీ కారణంగా సెవోక్ ఎయిర్ బేస్ (Sevoke Airbase)లో హెలికాప్టర్ ను అత్యవసరంగా ల్యాండ్ చేసినట్లు తెలిపారు.
అనంతరం సీఎం రోడ్డు మార్గం గుండా బాగ్ డోగ్రా విమానాశ్రయానికి చేరుకుని.. అక్కడి నుంచి కోల్ కతా బయలు దేరి వెళ్లినట్లు చెప్పారు. అయితే ఈ ఘటనలో దీదీ స్వల్పంగా గాయపడినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. మమతకు శరీరం వెనుకభాగంలో, మోకాలికి స్వల్పంగా గాయాలైనట్లు వెల్లడించారు. దీంతో సీఎంను అంబులెన్స్ లో కోల్ కతాలోని ఎస్ఎస్ కేఎమ్ ఆసుపత్రి (SSKM hospital)కి తీసుకెళ్లినట్లు చెప్పారు. ప్రస్తుతం మమతా బెనర్జీ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలిపారు.
Due to low visibility, West Bengal CM Mamata Banerjee's helicopter made an emergency landing at Sevoke Airbase. She was going to Bagdogra after addressing a public gathering at Krinti, Jalpaiguri. She is safe, says TMC leader Rajib Banerjee
(file pic) pic.twitter.com/IVNIPV3oJD
— ANI (@ANI) June 27, 2023
Also Read..
Navjot Sidhu | కాబోయే కోడలిని పరిచయం చేసిన నవజ్యోత్ సిద్ధూ.. గంగా నది ఒడ్డున కుమారుడి ఎంగేజ్మెంట్
SS Rajamouli | హాలిడే ట్రిప్ ను ఎంజాయ్ చేస్తున్న రాజమౌళి.. పిక్స్ వైరల్
Viral video | స్కూటీపై ఏడుగురు చిన్నారులతో రైడ్.. వ్యక్తి అరెస్ట్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

