ఇండియాలో పోకిరీల బైక్స్, కార్ల నెంబర్ ప్లేట్లపై రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేస్‌లో వింత రాతలు దర్శనమిస్తుంటాయి. కొందరు సినిమా పేర్లు రాసుకుంటే.. మరికొందరు సినిమాల్లో ఫేమస్ డైలాగ్స్ రాసుకుంటారు. ఇంకొందరు ఇంటిపేర్లు..వివిధ కొటేషన్లతో నంబర్ ప్లేట్ మొత్తం నింపేస్తారు. అయితే, ఇది పెద్ద నేరం. ఇలాగే చేసిన ఓ ముగ్గురిని కటకటాల్లోకి నెట్టారు ఉత్తరప్రదేశ్ పోలీసులు.
ఓ ముగ్గురు యువకులు ఒకే బైక్‌పై వెళ్తున్నారు. ఆ బైక్ వెనుక *బోల్దేనా పాల్ సాహెబ్ ఆయే తే* (పాల్సాహెబ్ వచ్చాడని చెప్పండి) అని రాసి ఉంది. ఇది గమనించిన పోలీసులు ఆ ముగ్గురిని పట్టుకుని లాకప్‌లో పెట్టారు. వీరి బైక్‌తోపాటు లాకప్‌లో ఉన్న ఫొటోలను యూపీ పోలీసులు ట్విటర్లో షేర్ చేశారు. ఈ పోస్ట్‌కు ఓ పాట జోడించగా, అది వైరల్ అవుతోంది. ఈ పాల్ సాహెబ్‌కు మీరు ఏ పాట డెడికేట్ చేస్తారంటూ పోలీసుల వ్యంగ్యంగా చేసిన ట్వీట్‌పై కామెంట్ల వర్షం కురుస్తున్నది.
मैं ‘पाल’ दो ‘पाल’ का राइडर हूँ
‘पाल’ दो ‘पाल’ मेरी कहानी है
‘पाल’ दो ‘पाल’ मेरी हस्ती है
‘पाल दो पाल’ मेरी जवानी है 😊आप ‘पाल’ साहब को कौन सा गाना डेडिकेट करना चाहेंगे?#तीनतिगाड़ाकामबिगाड़ा #बुरानामानोहोलीहै pic.twitter.com/q4ZZFCvrtk
— UP POLICE (@Uppolice) March 16, 2022