Gold Momos : గోల్డ్ మోమోస్ తిన్నారా ఎప్పుడైనా? ధర ఎంతో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే?
గోల్డ్ మోమోస్ తిన్నారా ఎప్పుడైనా? | మామూలుగా మోమోస్ ను చాలామంది ఇష్టపడతారు. పేరుకు నేపాల్ వంటకం అయినా మన దేశంలో అన్ని ప్రాంతాల్లో
మామూలుగా మోమోస్ ను చాలామంది ఇష్టపడతారు. పేరుకు నేపాల్ వంటకం అయినా మన దేశంలో అన్ని ప్రాంతాల్లో లభిస్తుంది. కొందరైతే లొట్టలేసుకుంటూ తింటారు మోమోస్ ను. తాజాగా ముంబైలోని ఓ రెస్టారెంట్.. గోల్డ్ మోమోస్ ను తయారు చేసింది. దానికి బాహుబలి గోల్డ్ మోమో అని పేరు పెట్టింది. 2 కిలోల బరువు ఉన్న ఆ బాహుబలి గోల్డ్ మోమో వీడియోను తమ ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేసింది ఆ రెస్టారెంట్. ఆ మోమోతో పాటు స్టార్టర్స్, ఇతర చట్నీలు, సాస్ లు ఏవి ప్రొవైడ్ చేస్తారో అన్నింటినీ ఆ వీడియోలో చూపించారు. ఆ గోల్డ్ మోమో ధరను రూ.1299 గా నిర్ణయించారు.

ఇక.. గోల్డ్ మోమోస్ ను చూడగానే నెటిజన్లకు నోరూరింది. ఈ బాహుబలి గోల్డ్ మోమోను 8 మంది వరకు తినొచ్చు. ఆర్డర్ కావాలంటే ఈ నెంబర్ కు ఫోన్ చేయండి.. అంటూ ఇన్ స్టాగ్రామ్ వీడియోలో రెస్టారెంట్ సిబ్బంది వెల్లడించారు. గోల్డ్ మోమోస్ తో పాటు 1 ఆరెంజ్ మింట్ మోజితో, 2 చాకొలేట్ మోమోస్, 3 చట్నీలు, మయో డిప్ ను అందిస్తారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Tandoori Roti : దాబాలో తందూరీ రోటీ చేస్తూ దాని మీద ఉమ్మేశాడు.. వీడియో వైరల్
6 కిలోల శిశువుకు జన్మనిచ్చిన మహిళ.. పుట్టగానే ఆ పిల్లాడు ఎలా ఉన్నాడో చూడండి
Squid Game Parody : స్క్విడ్ గేమ్ పేరడీ వీడియో చూశారా? చూస్తే నవ్వు ఆపుకోలేరు
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ | ఇక వన్డే సవాల్.. రోకోపైనే అందరి చూపు
Water Shortage | కాలేజీల్లో నీటి కొరత.. క్లాసులు బంద్.. విద్యార్థులను ఇంటికి పంపిన నారాయణ, శ్రీచైతన్య విద్యాసంస్థలు
SSC Exam Fee | విద్యాశాఖ డొల్లతనం.. టెన్త్ పరీక్ష ఫీజుల ఆన్లైన్ చెల్లింపుల్లో సర్వర్ సమస్య
Bureaucrats | డోంట్‌కేర్ సర్కార్.. ప్రభుత్వం పనైపోయింది, మళ్లీ వచ్చేది లేదు! నిర్ధారణకు వచ్చిన బ్యూరోక్రాట్లు
BC Atma Gaurava Bhavans | బీసీల ‘ఆత్మగౌరవం’పై కాంగ్రెస్ సర్కార్ పెత్తనం.. వేల కోట్ల విలువైన ఆస్తుల హస్తగతానికి గుట్టుగా జీవో!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

