ఒక చెట్టుకు ఎన్ని టమాటాలు కాస్తాయి? మహా అంటే 20 లేదా 30 కాయచ్చు. కానీ ఓ బ్రిటీష్ గార్డ్నర్ తోటలో అద్భుతం జరిగింది. ఒకే చెట్లుకు 1200 టమాటాలు కాశాయి. ఆ చెట్టు యజమాని పేరును ప్రపంచ రికార్డుల్లోకెక్కించింది. ఈ టమాటా చెట్టు ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
డగ్లస్ అనే బ్రిటీష్ వ్యక్తికి మొక్కలు పెంచడం హాబీ. హెర్ట్ఫోర్డ్షైర్లోని తన ఇంటివెనుకాల మొక్కలు పెంచుతుంటాడు. ఎక్కువ సమయం అక్కడే గడుపుతాడు. వివిధ పరిశోధనా పత్రాలను స్టడీ చేసి, ల్యాబొరేటరీలో మట్టినాణ్యతపై పరీక్షలు జరిపి మరీ టమాటా సాగుచేశాడు. కాగా, అందులో ఓ చెట్టుకు 1269 టమాటాలు కాశాయి. వాటిని చూసి ఉబ్బితబ్బిబ్బయ్యాడు. వెంటనే వరల్డ్ రికార్డుకు దరఖాస్తు చేశాడు.
గిన్నిస్ వరల్డ్ బుక్ రికార్డు నిర్వాహకులు వచ్చి టమాటాలను లెక్క పెట్టారు. పది టమాటాలను ఒక బాక్సులో పెట్టారు. పది బాక్సులను ఒక ట్రేలో పెట్టుకుంటూ లెక్కపెట్టారు. చివరగా ఒకే చెట్టుకు 1269 టమాటాలు కాసినట్లు ధ్రువీకరించారు. డగ్లస్ పేరు గిన్నిస్బుక్ రికార్డుల్లోకెక్కింది. అంతకుముందు ఒకే చెట్టుకు 839 టమాటాలు కాసినందుకుగానూ గిన్నిస్ రికార్డు డగ్లస్ పేరుపైనే ఉంది. అంటే డగ్లస్ తన రికార్డును తానే బద్దలుకొట్టుకున్నాడు.
A new Guinness world record! Delighted to announce that my record 1,269 tomatoes on a single truss has just been approved. It breaks my own record of 839 from last year #nodig – https://t.co/IF0LH73iOa @GWR @craigglenday @MattOliver87 pic.twitter.com/QgPJP3NsFk
— Douglas Smith (@sweetpeasalads) March 9, 2022