Viral Video | మోమోస్ నుంచి బర్గర్లు, సమోసాలు, మిర్చి బజ్జీల వరకూ స్ట్రీట్ స్నాక్స్ అంటే ఇష్టపడని వారుండరు. అయితే వీటిని కలిపి తీసుకోవడానికి ఎంతమంది మొగ్గుచూపుతారంటే అనుమానమే. అయితే ఓ వీడియో ఈ యూనిక్ ట్రెండ్‌ను నెటిజన్లు ముందుకు తీసుకువచ్చింది. ఓ వీధి వ్యాపారి మోమోస్‌తో వినూత్న బర్గర్‌ను తయారుచేశారు.
ఫుడ్ వ్లాగర్ ఈ వీడియోను ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేయగా ప్రస్తుతం ఆ క్లిప్ నెట్టింట తెగ వైరలవుతోంది. ఏ ఒక్కరూ ఈ తరహా వెరైటీ డిష్‌ను సర్వ్ చేయడం లేదని తెలుసుకున్నాక తాను సొంతంగా స్టాల్‌ను ఓపెన్ చేశానని వీధి వ్యాపారి చెబుతున్నారు. టేస్టీ మోమోస్ బర్గర్‌ను తయారుచేసేందుకు వీధి వ్యాపారి ప్రిపరేషన్ చెయ్యడం ఈ వీడియోలో కనిపిస్తుంది.
మయనీస్, టొమాటో, క్యారెట్ స్లైసెస్, కెచప్, బన్ వంటి ఎన్నో పదార్ధాలను వాడుతూ టేస్టీగా ఈ డిష్‌ను స్ట్రీట్ వెండార్ తయారుచేయడం వీడియోలో చూడొచ్చు. ఈ వీడియోపై నెటిజన్లు పెద్దసంఖ్యలో రియాక్టయ్యారు. యమ్మీ..నేనిప్పటికే దీన్ని ట్రై చేశానని ఓ యూజర్ కామెంట్ చేయగా, మరికొందరు ఫైర్, హార్ట్ ఎమోజీలను పోస్ట్ చేశారు. మరికొందరు ఈ స్టాల్ ఎక్కడ ఉందని కామెంట్స్ సెక్షన్లో ఆరా తీశారు.
Read More :
SIM cards | ఫేక్ డాక్యుమెంట్లతో 21 లక్షల సిమ్‌లు.. రద్దు చేసేందుకు DoT చర్యలు