Viral Video | సముద్రం అడుగున ప్లాస్టిక్ కవర్లో చిక్కుకున్న చేప.. స్కూబా డైవర్లు ఎలా రక్షించారో చూడండి
ప్లాస్టిక్ వల్ల ఎంత అనర్థం జరుగుతుందో తెలియజెప్పే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సముద్రం అడుగున ప్లాస్టిక్ కవర్లో చిక్కుకుని విలవిల్లాడుతున్న ఓ చేపను కొందరు స్కూబా డైవర్లు సురక్షితంగా కాపాడారు. ఇందుకు సంబంధించిన వీడియోను పర్యావరణ పరిరక్షకుడు మైక్ హుదేమా ట్విట్టర్లో పోస్టు చేశారు.
Viral Video | ప్లాస్టిక్ వల్ల ఎంత అనర్థం జరుగుతుందో తెలియజెప్పే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సముద్రం అడుగున ప్లాస్టిక్ కవర్లో చిక్కుకుని విలవిల్లాడుతున్న ఓ చేపను కొందరు స్కూబా డైవర్లు సురక్షితంగా కాపాడారు. ఇందుకు సంబంధించిన వీడియోను పర్యావరణ పరిరక్షకుడు మైక్ హుదేమా ట్విట్టర్లో పోస్టు చేశారు.
ఈ వీడియో శ్రీలంక చుట్టూ ఉన్న హిందూ మహాసముద్రంలో చిత్రీకరించినట్లు తెలుస్తోంది. బాక్సింగ్ డే సందర్భంగా.. సముద్ర సంరక్షణ సంస్థ, ది పెర్ల్ ప్రొటెక్టర్స్ సముద్రంలో వ్యర్థాల తొలగింపు చేపట్టారు. ఈ సందర్భంగా వారికి సముద్రం అడుగున ప్లాస్టిక్ కవర్లో చిక్కుకుని కదల్లేని స్థితిలో ఉన్న చేప కనిపించింది. ఆ చేపను వెంటనే వారు సురక్షితంగా బయటకు తీసి నీటిలోకి వదిలారు.
వీడియో షేర్ చేసిన మైక్.. ‘ఈ డైవర్ ప్లాస్టిక్‌లో చిక్కుకున్న చేపను రక్షించాడు. లెక్కలేనన్ని సముద్ర జీవులు మనం వదిలేసే ప్లాస్టిక్ వ్యర్థాల్లో చిక్కుకుంటున్నాయి. చిన్న ప్లాస్టిక్ ప్యాకేజింగ్ కూడా నీటి అడుగున ప్రాణాంతకం. ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేసే సమయం’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. గత నెల 26న పోస్టు చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోకు ఇప్పటి వరకు వేలల్లో వ్యూస్, లైక్స్ వచ్చాయి. వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు.
This Diver rescues a fish trapped in plastic.
Countless marine animals get trapped in plastic waste we discard. Even the smallest plastic packaging is deadly underwater.
It's time to end plastic pollution. This boxing day. Buy less.#ActOnClimate #ocean vid @PearlProtectors pic.twitter.com/iAWiySEChS
— Mike Hudema (@MikeHudema) December 26, 2022
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

