Sachin Tendulkar | థాయ్‌లాండ్‌లో సచిన్.. వైరల్ అవుతున్న కయాకింగ్ వీడియో
కయాకింగ్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన సచిన్
Sachin Tendulkar : టీమిండియా మాజీ ఆటగాడు సచిన్ టెండూల్కర్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత నచ్చినట్టు గడుపుతున్నాడు. సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేస్తూ అభిమానులతో టచ్‌లో ఉంటున్నాడు. తాజాగా థాయ్‌లాండ్ పర్యటనలో ఉన్న సచిన్ కయాకింగ్ చేస్తున్న వీడియో ఆన్లైన్లో వైరల్ అవుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో సచిన్ ఈ వీడియో షేర్ చేశాడు. అందులో కోచ్ మాస్టర్ బ్లాస్టర్‌కు కయాకింగ్ మెలకువలు వివరిస్తున్నాడు. కయాకింగ్ తెడ్డును ముందుకూ, వెనక్కీ కదిలించడం ఎలాగో అతను సచిన్‌కు నేర్పించాడు. ఆ తర్వాత సచిన్ సాగర తీరంలో కయాకింగ్ చేస్తూ సందడిగా గడిపాడు. ఈ వీడియోను ఇప్పటికే రెండు లక్షల మందికి పైగా చూశారు.
సచిన్ కయాకింగ్ వీడియోపై బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ ఆసక్తికరంగా స్పందించాడు. ‘సచిన్.. నిన్ను ఇంతకు ముందే ఫూలయ్ బే దగ్గర చూశాను. అక్కడే ఉన్నావా?’ అంటూ అతను కామెంట్ చేశాడు.. ‘క్రికెట్ దేవుడు తన కలల్లో జీవిస్తున్నాడు’ అంటూ ఒక యూజర్ కామెంట్ చేశాడు. కయాకింగ్ కోచ్‌ను ఉద్ధేశిస్తూ.. ‘సోదరా! నువ్వు ఎవరికీ కయాకింగ్ నేర్పిస్తున్నావో తెలసా.. క్రికెడ్ దేవుడికి’ అంటూ మరొక యూజర్ కామెంట్ పెట్టాడు. క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తర్వాత సచిన్ తన వారసుడు అర్జున్‌కు కెరీర్లో సాయంగా ఉంటున్నాడు. ఈమధ్యే గోవా తరఫన రంజీల్లో ఆరంగ్రేటం చేసిన అర్జున్ తొలి మ్యాచ్‌లోనే శతకం బాదాడు. 2022 ఐపీఎలో మినీ వేలంలో ముంబై ఇండియన్స్ అతడిని వేలంలో కొనుగోలు చేసింది.
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

