e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, November 29, 2021
Home News రాజ్‌కోట్‌లో త‌ల్వార్ రాస్ ఉత్స‌వం.. క‌త్తి విద్య‌లు ప్ర‌ద‌ర్శించిన రాజ‌వంశ‌ మ‌హిళ‌లు.. వీడియో

రాజ్‌కోట్‌లో త‌ల్వార్ రాస్ ఉత్స‌వం.. క‌త్తి విద్య‌లు ప్ర‌ద‌ర్శించిన రాజ‌వంశ‌ మ‌హిళ‌లు.. వీడియో

రాజ్‌కోట్‌: గుజ‌రాత్‌లో త‌ల్వార్ రాస్ ఉత్స‌వాలు క‌న్నుల పండుగ‌లా జ‌రుగుతున్నాయి. ఐదురోజుల‌పాటు ఈ ఉత్స‌వాలు కొన‌సాగుతాయి. రాజ్‌కోట్‌కు చెందిన రాజ‌కుంటుంబం గ‌త 12 ఏండ్లుగా ప్ర‌తి ఏటా ఈ ఉత్స‌వాల‌ను నిర్వ‌హిస్తున్న‌ది. ఈ ఉత్స‌వాల్లో 200 మందికిపైగా రాజ్‌పుత్ మ‌హిళలు పాల్గొన్నారు. సంప్ర‌దాయ వ‌స్త్ర‌ధార‌ణ‌లో ఈ ఉత్స‌వాల్లో పాల్గొన్న మ‌హిళ‌లు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు. క‌త్తుల‌ను చేబూని నృత్య ప్ర‌ద‌ర్శ‌న‌లు చేశారు. క‌త్తుల‌తో ర‌క‌ర‌కాల విన్యాసాలు చేసి చూపించారు.

‘త‌ల్వార్ రాస్ ఉత్స‌వాల‌ను గ‌త 12 ఏండ్లుగా నిర్వ‌హిస్తున్నాం. ప్ర‌తి ఏడాది కొత్త బృందం ఈ ఉత్స‌వాల్లో క‌త్తి విద్య‌ల‌ను ప‌ద‌ర్శిస్తున్న‌ది. మ‌హిళ‌లు ఎంతో ఉత్సాహంగా ఈ ఉత్స‌వాల్లో పాల్గొంటారు’ అని రాజ్‌కోట్‌కు చెందిన రాకుమారి కాదంబ‌రి దేవి చెప్పారు. క‌త్తి త‌మ‌కు దేవ‌త‌తో స‌మాన‌మ‌ని, అందుకే తాము ప్ర‌తి ఏడాది శ‌స్త్ర పూజ చేస్తామ‌ని ఆమె తెలిపారు. రాజ‌వంశానికి చెందిన ఎంద‌రో వీర‌నారుల చ‌రిత్ర‌ను చాటిచెప్ప‌డానికి ఈ ఉత్స‌వాల‌ను తోడ్ప‌డుతున్నాయ‌ని అన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement