లక్నో: మూర్ఛతో గూడ్స్ రైలు కింద పడి ఒక ప్రభుత్వ రైల్వే పోలీస్ కానిస్టేబుల్ మరణించాడు. ఉత్తర ప్రదేశ్‌లోని ఆగ్రా రైల్వే స్టేషన్లో గత శనివారం ఈ ఘటన జరిగింది. ఉత్తర ప్రదేశ్‌లోని బిజ్నోర్కు చెందిన రీగల్ కుమార్ సింగ్ ప్రభుత్వ రైల్వే పోలీస్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. శనివారం రాత్రి ఖాళీగా ఉన్న ఫ్లాట్‌ఫామ్ వద్ద ఆయన చాలా మామూలుగా నుల్చొని ఉన్నాడు. ఆయన వెనక రైలు పట్టాలపై ఒక గూడ్స్ రైలు వెళ్తున్నది.
అయితే ఒక్కసారిగా పక్కకు తిరిగి గూడ్స్ రైలు వెళ్లడం చూసిన కుమార్ సింగ్, అలా పలుమార్లు గుండ్రంగా తిరిగాడు. తిరుగుడు మూర్ఛ వల్ల ఫ్లాట్‌ఫాం అంచు నుంచి వెళ్తున్న గూడ్స్ రైలు, పట్టాల మధ్యలో పడ్డాడు. అయితే ఆయనకు సమీపంలోనే బెంచ్‌పై కూర్చొన్న ఒక ప్రయాణికుడు మొబైల్లో మునిగిపోయి దీనిని గమనించలేదు.
కాగా, కానిస్టేబుల్ రీగల్ కుమార్ సింగ్ గిరగిర తిరుగుతుండాన్ని చూసిన ఒక టీటీఈ ఆయనను కాపాడేందుకు పరుగెత్తుకుని అక్కడకు వచ్చారు. అయితే అప్పటికే ఫ్లాట్‌ఫామ్ పైనుంచి గూడ్స్ రైలు, పట్టాల మధ్యలో పడటంతో కాపాడలేకపోయారు. తీవ్రంగా గాయపడిన ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.
మరోవైపు రైల్వే కానిస్టేబుల్ కుమార్ సింగ్ మృతి విషయం తెలిసి ఆయన కుటుంబ సభ్యులు షాకయ్యారు. ఆరోగ్యంగానే ఉన్న ఆయనకు తిరుగుడు మూర్ఛ ఎందుకు వచ్చింది అన్నది వారికి అర్థం కాలేదు. ఆ కానిస్టేబుల్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. 2011లో యూపీలో పోలీస్‌లో చేరిన ఆయన 2021 నుంచి ప్రభుత్వ రైల్వే పోలీస్ (జీఆర్పీ)లో పనిచేస్తున్నాడు.
కాగా, కానిస్టేబుల్ కుమార్ సింగ్‌కు గైరేటరీ ఫిట్స్ (తిరుగుడు మూర్ఛ) ఉన్నట్లు వైద్య నిఫుణులు అనుమానిస్తున్నారు. ఈ మూర్ఛ అరుదుగా వస్తుందని తెలిపారు. తిరుగుడు మూర్ఛ వచ్చినప్పుడు వ్యక్తులు ఉన్నచోటనే 180 లేదా 360 డిగ్రీల వృత్తాకారంలో లేదా గిరగిర తిరిగి కిందకు పడిపోతారని చెప్పారు. సాధారణంగా కదులుతున్న వాటిని చూసినప్పుడు ఇలాంటి తిరుగుడు ఫిట్స్ వస్తుందన్నారు. ఈ నేపథ్యంలో కదిలే వాటికి చాలా దూరంగా ఉండాలని వైద్య నిఫుణులు సూచించారు. మరోవైపు అక్కడి సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
This happened in Agra Railway Station.This is called " Gyratory Seizure". They are defined as rotation around d body's axis during a seizure for at least 180° Looking at big moving objects in different directions may cause this temporary neuro-anomaly
Stay away frm moving trains pic.twitter.com/3gO0y43zVo— Subba Rao 🇮🇳🇮🇳 (@TNSubbaRao1) April 20, 2022