Viral Video | బాలీవుడ్ పాటకు నేపాలీ అమ్మాయిలు చేసిన డ్యాన్స్ వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. తమదైన స్టైల్లో స్టెప్పులేసి నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నారు.
ఖాట్మాండూకు చెందిన ది వింగ్స్ టీమ్ యువతులు.. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ నటించిన ‘క్వీన్’ చిత్రంలోని ‘లండన్ తమక్డ..’ పాటకు క్రేజీ మూమెంట్స్‌తో స్టెప్పులేశారు. ట్రాక్ ప్యాంట్లు ధరించి నలుగురు యువతులు ఫుల్ ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్‌తో అదరగొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియోను నెట్టింట్లో షేర్ చేయగా.. ప్రస్తుతం విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఇప్పటి వరకు 2 కోట్ల మందికి పైగా వీక్షించారు. వేలల్లో కామెంట్లు వచ్చాయి. డ్యాన్స్ చూసిన నెటిజన్లు.. అమ్మాయిలు అదరగొట్టారంటూ కామెంట్స్ పెడుతున్నారు. కాగా, కంగనా రనౌత్ నటించిన ‘క్వీన్’ చిత్రం 2014లో ప్రేక్షకుల ముందుకొచ్చింది.