Naked Man : నగ్నంగా బార్‌కు వెళ్లి అతడు చేసిన పనికి అందరూ షాక్..!
నగ్నంగా బార్‌కు వెళ్లి అతడు చేసిన పనికి అందరూ షాక్ | ఒక్కొక్కొరికి ఒక్కో పిచ్చి అంటారు కదా. కొందరు తమకు నచ్చింది చేయడం కోసం ఎంతకైనా తెగిస్తారు.
ఒక్కొక్కొరికి ఒక్కో పిచ్చి అంటారు కదా. కొందరు తమకు నచ్చింది చేయడం కోసం ఎంతకైనా తెగిస్తారు. ఏమాత్రం కూడా ఆలోచించరు. ఎదుటివాళ్లు ఏమనుకుంటున్నారు అని కూడా పట్టించుకోరు. అటువంటి వాళ్లలో ఈ వ్యక్తి కూడా ఒకడు కావచ్చు. ఎందుకంటే.. బార్‌కు బట్టలు లేకుండా నగ్నంగా వెళ్లాడు.

ఈ ఘటన యూకేలోని బెర్క్‌షైర్‌లో చోటు చేసుకుంది. మైదెన్హెడ్లో ఉన్న ఓ బార్లోకి వెళ్లిన ఓ వ్యక్తి.. బార్లోకి వెళ్లగానే తను వేసుకున్న బట్టలు విప్పేసి.. బార్టెండర్స్ దగ్గరికి వెళ్లి వాళ్లతో కాసేపు మాట్లాడాడు. అయితే.. ఆ వ్యక్తి నగ్నంగా కనిపించగానే.. బార్‌కు వచ్చిన వాళ్లంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు.
బార్టెండర్స్తో ఆ వ్యక్తి మాట్లాడుతుండగా.. బార్లో ఉన్న ఒకరు ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

అయితే.. ఆ వ్యక్తి ఎందుకలా చేశాడు అని ఆరా తీస్తే చివరికి తెలిసిందేంటో తెలుసా? తన ఫ్రెండ్స్‌తో వచ్చిన ఆ వ్యక్తి.. వాళ్లతో పందెం కాశాడట. 20 పౌండ్స్ కోసం బట్టలు విప్పి అలా నగ్నంగా బార్లో తిరిగాడట.
తన ఫ్రెండ్స్‌తో వచ్చిన ఆ వ్యక్తి.. సడెన్‌గా తను కూర్చున్న ప్రాంతం నుంచి లేచి.. బట్టలు విప్పేశాడు. నగ్నంగా బార్లో తిరిగాడు. దీంతో మేం షాక్ అయిపోయాం.. అని బార్లో ఉన్న ఓ వ్యక్తి చెప్పాడు.
బార్టెండర్స్ దగ్గరికి వెళ్లి కూడా ఏదో టైమ్‌పాస్‌గా మాట్లాడాడు తప్పితే.. అక్కడ ఎటువంటి వైన్ కూడా ఆర్డర్ ఇవ్వలేదని బార్లో ఉన్నవాళ్లు చెప్పారు. ఆ తర్వాత కొంత సేపటికి మళ్లీ తన బట్టలను వేసుకొని తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్లిపోయాడని చెప్పారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Frog Viral Photo : ఈ ఫోటోలో కప్ప ఎక్కడుందో కనిపెడితే మీరు గ్రేట్
సీతాకోక చిలుకకు ప్రాణం పోసిన మహిళ.. వీడియో వైరల్
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

