ఒక్కొక్కరికి ఒక్కో పిచ్చి ఉంటుంది. కొందరికి తిరగడం అంటే పిచ్చి.. ఇంకొందరికి సెల్ఫీలంటే పిచ్చి. మరికొందరికి సోషల్ మీడియాలో ట్రెండ్ అవడం అంటే ఇష్టం. అలా ఎవరికి నచ్చింది వాళ్లు చేస్తుంటారు కానీ.. కొన్ని విషయాల్లో తొందరపడి నెటిజన్ల నుంచి తీవ్రంగా విమర్శల పాలు కూడా అవుతుంటారు. తాజాగా యూఎస్‌లోని ఫ్లోరిడాలో అటువంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది.
ఇన్స్టాగ్రామ్ మోడల్ జైనె రివెరాకు సోషల్ మీడియాలో కోట్లలో ఫాలోవర్స్ ఉన్నారు. తను ఏ విషయం అయినా సరే.. సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. తన పర్సనల్ విషయాలు కూడా సోషల్ మీడియాలో పెట్టి కోట్ల మంది అభిమానులను సంపాదించుకుంది. అయితే.. ప్రస్తుతం తను పెట్టిన కొన్ని ఫోటోలతో ఒక్కసారిగా నెటిజన్ల ఆగ్రహానికి గురయింది.
తన తండ్రి చనిపోతే.. అతడి శవం పక్కన ఫోటోషూట్ చేసింది. అది కూడా నవ్వుతూ ఫోటోలు దిగి వాటిని తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేసింది. ఆ ఫోటోలు చూసిన నెటిజన్లు తనపై విరుచుకుపడుతున్నారు. అసలు నువ్వు మనిషివేనా.. నీకు బుద్ధి ఉందా? తండ్రి శవాన్ని పక్కన పెట్టుకొని ఈ ఫోటోషూట్లు ఏంది? ఆ నవ్వులు ఏంది? అంటూ తనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడటంతో వెంటనే ఆ పోస్ట్‌ను డిలీట్ చేసింది రివెరా.
కానీ.. తను ఆ పోస్ట్‌ను డిలీట్ చేయడానికి ముందే స్క్రీన్ షాట్లు తీసిన నెటిజన్లు వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. దీంతో తను యూఎస్‌లో టాక్ ఆఫ్ ది టౌన్ అయింది.
this Instagram model’s father passed away,,,, and she did a photo shoot with the open casket…. pic.twitter.com/u1EVNxaajz
— Mac McCann (@MacMcCannTX) October 26, 2021
Have I mentioned the problem of a narcissistic and performative culture https://t.co/l7U7ZqdQKO
— Tom Nichols (@RadioFreeTom) October 27, 2021
Not only is there a mental illness issue in this nation people seem to have lost all decency
— Dubbin_N_Dabbin_FGC (@dubbin_n) October 27, 2021
why would you wear this to a funeral
— s😵💫 (@sour_silk) October 26, 2021
A daughter loses father, she's hurting.
— Noisy Ninja (@NoisyNinja2) October 27, 2021
Send prayers & love.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
పెండ్లికి ముందే శృంగారం.. మైనర్ బాలికకు గర్భం.. యూట్యూబ్ వీడియో చూస్తూ సీక్రెట్‌గా డెలివరీ..!
Squid Game : స్క్విడ్ గేమ్ వీఐపీ యాక్టర్ గెయోఫ్రే గుర్తున్నాడా? ఆయనకు ఇండియాతో కనెక్షన్ ఉందట
Alligator Attacks Man : ఈత కొడుతున్న వ్యక్తిపై మొసలి దాడి.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా?