Viral Video | ఐస్‌క్రీం దోశ.. షాకవుతున్న నెటిజన్లు..!
ఓ వీధి వ్యాపారి ఐస్‌క్రీంతో దోశ తయారు చేసి కొత్త ట్రెండ్‌ను సృష్టించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అది చూసిన నెటిజన్లు షాక్ అవుతూ కామెంట్లు పెడుతున్నారు.
Viral Video | దక్షిణాది టిఫిన్స్‌లో దోశకు ఉన్న క్రేజే వేరు. క్రిస్పీగా ఎంతో రుచికరంగా ఉండే ఈ దోశను పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా తింటారు. అయితే, ఈ దోశలో చాలా వెరైటీలు ఉన్నాయి. మసాలా దోశ, ఉల్లి దోశ, కారం దోశ, పొడి మసాలా దోశ, ఘీ కారం దోశ, రోస్ట్ దోశ, ఎగ్ దోశ, ప్లెయిన్, బట్టర్, ఛీజ్, పిజ్జా దోశ.. ఇలా చెప్పుకుంటూ పోతే వందకు పైగా వెరైటీ దోశలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ఆహార ప్రియులు వారికి ఇష్టమైన వెరైటీ వెరైటీ దోశలను ఆస్వాదిస్తూ ఆరగించేస్తున్నారు.
అయితే, తాజాగా ట్విట్టర్లో ఓ విచిత్రమైన దోశ వైరల్ అవుతోంది. అదే.. ఐస్‌క్రీం దోశ..! షాకయ్యారు కదూ. ఈ కాంబినేషన్ దోశ ఎప్పుడూ విని ఉండరు. చూసి ఉండరు కూడా. ఓ వీధి వ్యాపారి ఐస్‌క్రీంతో దోశ తయారు చేసి కొత్త ట్రెండ్‌ను సృష్టించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అది చూసిన నెటిజన్లు షాక్ అవుతూ కామెంట్లు పెడుతున్నారు. ఆ వెరైటీ, విచిత్రమైన దోశపై మీరూ ఓ లుక్కేయండి.
South Indian dish dosa ko Gujarat me survive karne k liye icecream se dosti karna pad ja raha hai 😭😭😹 pic.twitter.com/Pq2UBuHriE
— Byomkesh (@byomkesbakshy) January 28, 2023
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Govt Land | ఐదెకరాల సర్కార్ స్థలంపై డేగ కన్ను.. రాత్రికి రాత్రే ఆ భూమిలో బోర్లు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
ట్రెండింగ్ వార్తలు
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!

