లండన్ : కలల ఇంటిని సొంతం చేసుకోవడం ఏమంత సులభం కాదు. ధర, ప్రాంతం, విస్తీర్ణం వంటి ఎన్నో అంశాలను చెక్ చేసుకుని అన్నీ సరిగ్గా కుదిరితేనే సొంతిల్లు సమకూర్చుకోగలం. అయితే బ్రిటన్‌లో భారీ ధరకు ఓ పాత ఇంటిని అమ్మకానికి పెట్టడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇల్లు కోసం వెతుకుతున్న రెబెకా గ్లోవర్‌కు ఆన్లైన్లో ఈ ఇల్లు కంటపడింది.
బ్రిటన్‌లోని బర్మింగ్‌హామ్‌లో మూడు బెడ్రూమ్ల ఇల్లు అమ్మకానికి ఉందని ఆన్లైన్లో పోస్ట్ చేశారు. ఈ ఇంట్లో ఓ బెడ్రూం మధ్యలో బాతింగ్ క్యూబికల్ (స్నానాల గది)ను అమర్చడం ఎబ్బెట్టుగా అనిపిస్తోంది. గోర్డన్ జోన్స్ ఎస్టేట్ ఏజెంట్స్ ఈ ప్రాపర్టీని విక్రయిస్తోంది. ఈ ఇంటిని ఏకంగా 1.6 కోట్లకు అమ్మకానికి పెట్టారు.
బెడ్రూం మధ్యలో బాత్రూం ఎందుకనే మీమాంసతో కొనుగోలుదారులు తలలు పట్టుకుంటుంటే ఇంట్లో నివసించే వారు ఈ షవర్ క్యూబికల్తో సౌకర్యంగా ఉండవచ్చని ఏజెంట్లు చెబుతున్నారు. దెయ్యం వెంబడిస్తుందని భయపడితే అర్ధరాత్రి టాయ్‌లెట్‌కు వెళ్లే సమయంలో ఈ షవర్ సాయపడుతుందని కూడా నచ్చచెప్పినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని యూజర్లు పెదవివిరుస్తున్నారు.