అతడి వయస్సు 16 ఏళ్లు. ప్రపంచంలోనే అందరికంటే పొడువైన టీనేజర్. ఏడు ఫీట్ల 5.33 ఇంచుల ఎత్తున్న మనిషి. మరి అతడు నిత్య జీవితంలో ఎలా ఉంటాడు.? తోటి మిత్రులతో ఎలా ఆడుకుంటాడు? ఇది తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది. అలాంటి వారికోసమే గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఓ వీడియో విడుదల చేసింది.
కెనాడాకు చెందిన రియోక్స్ ఒలివియర్ ప్రపంచంలోనే పొడవైన టీనేజర్. అతడిపై గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ డాక్యుమెంటరీ తీసింది. ఈ వీడియోలో ఒలివియర్ కారులో నుంచి ఎలా దిగుతాడు..ఇంట్లో డోర్ తగలకుండా ఎలా నడుస్తాడు..తోటి మిత్రులతో బాస్కెట్ బాల్ ఎలా ఆడుతాడో చూపించారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. ఇన్స్టాలో పెట్టిన ఈ వీడియోకు ఇప్పటివరకూ 1.1 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.