Ghost Patient | దెయ్యాన్ని ఎప్పుడైనా చూశారా..? మాట్లాడారా..? అసలు నిజంగా విశ్వంలో దెయ్యాలు ఉన్నాయా..? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఎవరూ చెప్పలేరు. అయితే, అర్జంటీనాలో జరిగిన ఓ ఘటన మాత్రం ప్రస్తుతం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అక్కడ ఆసుపత్రిలోని ఓ సెక్యూరిటీ గార్డు ‘ఘోస్ట్ పేషెంట్’తో మాట్లాడాడు. ఇందుకు సంబంధించిన వీడియో సైతం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు షాక్కు గురవుతున్నారు. నిజంగా దెయ్యాలు ఉన్నాయా అంటూ చర్చించుకుంటున్నారు.
ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. అర్జంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్లోని ఫినోచియాటో శానిటోరియం అనే ప్రైవేట్ కేర్ సెంటర్లో రాత్రిపూట ఓ సెక్యూరిటీ గార్డు విధుల్లో ఉంటాడు. సుమారు 3గంటల ప్రాంతంలో ఆసుపత్రి మెయిన్డోర్స్ ఒక్కసారిగా తెరచుకుంటాయి. చూడ్డానికి అక్కడ ఎవరూ ఉండరు. కానీ, అక్కడే ఉన్న సెక్యూరిటీ గార్డు మాత్రం తన సీటులో నుంచి లేచి.. నో ఎంట్రీ రోప్ తీసి ఆసుపత్రి రిజిస్టర్లో ఎవరో పేషెంట్ వచ్చినట్లు వివరాలు నమోదు చేసుకుంటాడు. కాసేపు ‘ఘోస్ట్ పేషెంట్’ తో ముచ్చటిస్తాడు కూడా. అనంతరం లోపలికి ఎలా వెళ్లాలో వివరించి.. తిరిగి తన సీట్లోకి వచ్చి కూర్చుంటాడు. ఈ తతంగమంతా ఆసుపత్రిలోని సీసీటీవీ ఫుటేజీలో రికార్డై ఉంటుంది. ఇది చూసిన వైద్యులు, ఇతర సిబ్బంది ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురవుతారు. వీడియో కాస్తా వైరల్ కావడంతో ఆసుపత్రిలోకి ‘ఘోస్ట్ పేషెంట్’ వచ్చిందంటూ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతోంది.
మరోవైపు సెక్యూరిటీ గార్డుకు నిజంగానే ‘ఘోస్ట్ పేషెంట్’ కనిపించిందా.. లేక కావాలనే ఇలా చేశాడా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక మీడియా కథనాల ప్రకారం.. ఆసుపత్రిలో అంతకు ముందు రోజు ఓ రోగి చనిపోయారని.. ఆ భ్రమలోనే ఆసుపత్రి గార్డు ఇలా ప్రవర్తించి ఉంటాడని రాసుకొచ్చారు. ‘ఘోస్ట్ పేషెంట్’కు సంబంధించిన దృశ్యాలు మాత్రం ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Guard speaks to ‘ghost patient’ in spine-chilling viral video. Internet has this to say.
.
.#viralvideo #viralnews #reel #viralshorts #trendingreel #trendingvideos #topvideos #ghost #ghostvideo #ghosttrend #memes #viralbake pic.twitter.com/ceCHNgDEgg— Viral Bake (@viralbake) November 22, 2022