జస్ట్ మిస్.. మహిళ ప్రాణాలను కాపాడిన సిగరెట్.. వైరల్ వీడియో
మహిళ ప్రాణాలను కాపాడిన సిగరెట్ | ఒక్కోసారి క్షణాల్లోనే ఎన్నో ప్రమాదాలను తప్పించుకుంటాం. ఒక్క క్షణం ఆలస్యమయినా.. ముందయినా.. ప్రాణాలు పోయేవి అంటూ మనం ఎన్నో వీడియోలు చూసుంటాం.
ఒక్కోసారి క్షణాల్లోనే ఎన్నో ప్రమాదాలను తప్పించుకుంటాం. ఒక్క క్షణం ఆలస్యమయినా.. ముందయినా.. ప్రాణాలు పోయేవి అంటూ మనం ఎన్నో వీడియోలు చూసుంటాం. ముఖ్యంగా ట్రెయిన్ ఎక్కేటప్పుడు.. దిగేటప్పుడు ఒక్క క్షణం ఆలస్యమైనా ట్రెయిన్ కింద పడి వాళ్లు చనిపోయేవాళ్లు అంటూ సోషల్ మీడియాలో వచ్చే వీడియోలు కూడా చూస్తుంటాం.

తాజాగా ఓ చెట్టు రూపంలో ఓ మహిళకు ప్రమాదం ముంచుకొచ్చింది. కానీ.. క్షణంలో ఆ ప్రమాదం నుంచి ఆ మహిళ తప్పించుకోగలిగింది. అందులో తను సిగిరెట్ వల్ల తన ప్రాణాలను కాపాడుకోగలిగింది.
యూకేకు చెందిన ఓ మహిళ పబ్ మేనేజర్‌గా పనిచేస్తోంది. పబ్‌లో పని చేసి అలసిపోయి.. బయటికి వచ్చి కాసేపు రిలాక్స్ అవుదామనుకుంది. ఒక చోట నిలబడి సిగరెట్ తాగుతోంది. సిగరెట్ అయిపోయింది.. ఇక పబ్‌కు వెళ్దామని ఆ మహిళ అనుకుందో లేదో అంతలోనే తన పక్కనే పెద్ద చెట్టు పడిపోయింది.
ఒక్క క్షణం తను ముందు వెళ్లినా కూడా ఆ చెట్టు కింద తను నలిగిపోయేది. సిగరెట్ తాగడం ఒక్క క్షణం ముందు అయిపోయినా కూడా తన పని అయిపోయేది. ఆ చెట్టు కింద పడిపోయాక.. ఆ చెట్టు కొమ్మలను దాటుకుంటూ ఆ మహిళ పబ్‌లోకి వెళ్లిపోయిందట.
ఈ ఘటన అక్కడే ఉన్న సీసీకెమెరాలో రికార్డు అయింది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో చూసిన నెటిజన్లు.. ఆ మహిళను సిగిరెటే కాపాడిందని కామెంట్లు చేస్తున్నారు. తను సిగరెట్ తాగడం ఒక్క క్షణం ముందు అయిపోయినా కూడా ఆ మహిళ ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
చివరి నిమిషంలో ఫుడ్ ఆర్డర్ చేశాడు.. రెస్టారెంట్ ఏం డెలివరీ చేసిందో తెలుసా?
జాబ్ కావాలి.. మెట్రో స్టేషన్ వద్ద రెజ్యూమ్‌తో నిరుద్యోగి.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా?
పురిటి నొప్పులు వస్తున్నా.. సైకిల్ తొక్కుతూ ఆసుపత్రికి వెళ్లి బిడ్డకు జన్మనిచ్చిన ఎంపీ
Monkey Festival : అక్కడ కోతుల పండుగే స్పెషల్ అట్రాక్షన్.. ఎందుకు జరుపుతారో తెలుసా?
ఇప్పటికీ ఎయిర్‌పోర్ట్‌లు లేని దేశాలు ఉన్నాయని తెలుసా?
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

