Viral Video | తళపతి విజయ్, పూజా హెగ్డే నటించిన ‘ది బీస్ట్’ చిత్రంలోని ‘అరబిక్ కుత్తు’ సాంగ్కు ఉన్న క్రేజే వేరు. సాధారణ ప్రేక్షకులే కాదు సెలబ్రిటీలు సైతం ఈ పాటకు రీల్స్ చేస్తూ నెట్టింట తెగ సందడి చేశారు. తాజాగా ఓ 70 ఏళ్ల వృద్ధుడు ఈ పాటకు కాలు కదుపుతూ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాడు. వయసు కేవలం సంఖ్య మాత్రమే అని నిరూపిస్తున్నాడు.
ఇందుకు సంబంధించిన వీడియోను శృతి వాసుదేవన్ అనే ఇన్స్టాగ్రామ్ యూజర్ పోస్టు చేశారు. వీడియోలో ఏముందంటే… 70 ఏళ్ల వృద్ధుడు ‘అరబిక్ కుత్తు’ పాటకు ఎంతో ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తూ కనిపిస్తాడు. తనదైన స్టైల్లో స్టెప్పులేస్తూ ఉంటాడు. అక్కడే కుర్చీలో కూర్చొని ఉన్న అతని భార్య.. అతని స్టెప్పులు చూసి నవ్వుతుంటుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
‘దంపతులు ఇలా ఉంటే.. జీవితం సంతోషంగా గడిచిపోతుంది’… ‘వయసు కేవలం సంఖ్య మాత్రమే అని చెప్పడానికి నిదర్శనమే ఈ వీడియో’.. ‘వారి ప్రేమ చాలా స్వచ్ఛమైనది..’ ‘సో క్యూట్’.. ‘కపుల్ గోల్స్ బీ లైక్’.. అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం అరబిక్ కుత్తు సాంగ్కు వృద్ధుడి స్టెప్పులు మీరూ చూసేయండి..!