జైలు గోడల మధ్య పాడిన పాట.. ఖైదీ జీవితాన్నే మార్చేసింది..!
జైలు గోడల మధ్య పాడిన పాటతో ఓ ఖైదీ జీవితమే మారిపోయింది. ఏకంగా అతనికి అవకాశాలు వరుస కట్టేలా చేసింది. వివరాల్లోకి వెళితే.. బీహార్‌కు చెందిన కన్నయ్య కుమార్.. మద్యం మత్తులో అనుచితంగా ప్రవర్తించాడన్న కారణంతో బుక్సర్ పోలీసులు అతన్ని అరెస్టు చేశారు.
Viral Video | జైలు గోడల మధ్య పాడిన పాటతో ఓ ఖైదీ జీవితమే మారిపోయింది. ఏకంగా అతనికి అవకాశాలు వరుస కట్టేలా చేసింది. వివరాల్లోకి వెళితే.. బీహార్‌కు చెందిన కన్నయ్య కుమార్.. మద్యం మత్తులో అనుచితంగా ప్రవర్తించాడన్న కారణంతో బుక్సర్ పోలీసులు అతన్ని అరెస్టు చేశారు.
దీంతో జైల్లో ఉన్న కన్నయ్య.. అక్కడ భోజ్‌పూర్ పాట పాడాడు. ఈ పాటను రికార్డ్ చేసిన జైలు అధికారులు.. వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అది చూసిన నెటిజన్లు కన్నయ్యను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. మరోవైపు అతనికి అవకాశాలు కూడా వరుస కడుతున్నాయి. వీడియో చూసిన పలువురు టాప్ సింగర్లు కన్నయ్యకు పాట పాడే అవకాశం కల్పిస్తున్నారు.
ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ అంకిత్ తివారీ సైతం కన్నయ్య పాటకు ఫిదా అయ్యారు. ఈ మేరకు అతనికి పాట పాడే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. ‘కన్నయ్యకు నా మ్యూజిక్ కంపెనీలో పాట పాడే అవకాశం ఇస్తున్నా’ అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం కన్నయ్య పాట వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
TV के पूर्व सहयोगी @cmohan_pat के माध्यम से संपर्क करने पर पता चला कि ये कैमूर का गरीब युवक कन्हैया है,नशे में मिलने पर बिहार पुलिस ने इसे जेल भेजा,इनकी कानूनी मदद के उपरांत इन्हें सुधारने का प्रयास होगा,साथ ही UP के मशहूर त्रिनेत्र स्टूडियो में गाने का अवसर भी उपलब्ध कराया जाएगा pic.twitter.com/Id8HrJV2HZ
— Dr. Shalabh Mani Tripathi (@shalabhmani) January 8, 2023
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

