న్యూఢిల్లీ: కంపెనీలు వేరైనప్పటకీ రెండు సంస్థలకు చెందిన ఫుడ్ డెలివరీ ఏజెంట్లు తమ ఐక్యతను వినూత్నంగా చాటారు. ఇద్దరు ఫుడ్ డెలివరీ వ్యక్తులు ఒకరికి ఒకరు సహకరించుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో కనిపించిన ఈ దృశ్యం నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకున్నది. ఢిల్లీలో మిట్ట మధ్యాహ్నం వేళ స్విగ్గీ డెలివరీ ఎగ్జిక్యూటివ్ బైక్‌పై వెళ్తున్నాడు. అయితే అదే సమయంలో సైకిల్‌పై వెళ్తున్న జొమాటో డెలివరీ వ్యక్తికి అతడు సహకరించాడు. ఆ వ్యక్తి చేయి పట్టుకుని లాక్కెళ్లడంతో జొమాటో డెలివరీ ఏజెంట్‌కు సైకిల్ తొక్కే శ్రమ తప్పింది.
కాగా, వారి వెనుకే కారులో వెళ్తున్న వ్యక్తి దీనిని తన మొబైల్ ఫోన్లో రికార్డు చేశాడు. ‘సంస్థలు విడదీసినా.. మానవత్వం కలిపింది’ అన్న శీర్షికతో రెడ్డిట్‌లో శనివారం పోస్ట్ చేశాడు. ‘హాట్ ఢిల్లీ రోజుల్లో.. నిజమైన స్నేహం కనిపించింది’ అని అందులో పేర్కొన్నాడు.
మరోవైపు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై నెటిజన్లు స్పందించారు. రెండు సంస్థలకు చెందిన ఫుడ్ డెలివరీ వ్యక్తులు సహకరించుకోవడం అద్భుతమని కొనియాడారు. అయితే చాలా సందర్భాల్లో స్విగ్గీ బ్యాగ్ నుంచి జొమాటో ఆర్డర్, జొమాటో బ్యాగ్ నుంచి స్విగ్గీ ఫుడ్ ఆర్డర్లు డెలివరీ చేయడాన్ని మనం చూస్తుంటామని కొందరు గుర్తు చేశారు.