కరోనా ముగిసింది. పెళ్లిల్లు జోరుగా జరుగుతున్నాయి. మూడేళ్లుగా పెళ్లి వాయిదా వేసుకున్నవారు ఇప్పుడు ఘనంగా వివాహ వేడుక జరుపుకుంటున్నారు. వధూవరులు వివిధ పాటలపై స్టెప్పులేసే వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా, ఓ వధువు తన సంగీత్ ఫంక్షన్లో బాలీవుడ్ హిట్సాంగ్పై డ్యాన్స్ చేసిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది.
ఆకాంక్ష మిశ్రా అనే వధువు తన సంగీత్ ఫంక్షన్లో ‘బొలె చూడియా’ పాటపై అదిరిపోయే స్టెప్పులేసింది. ఈ పాట 2001లో విడుదలైన ‘కభీ ఖుషీ కభీ గమ్’ అనే బాలీవుడ్ చిత్రంలోనిది. ఇది వధువు ఫేవరేట్ సాంగ్. అందుకే అందమైన లెహంగాలో స్టేజిపై తళుక్కుమన్న వధువు అదిరిపోయే స్టెప్పులేసి నెటిజన్ల మనసు దోచుకుంది. ఈ వీడియో చూసినవారంతా ఫిదా అయిపోతున్నారు.