Viral Video | మూడు ముళ్లు.. ఏడడుగుల బంధంతో అగ్నిసాక్షిగా ఒక్కటయ్యారు. కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య కొత్త జీవితానికి ఎంతో ఘనంగా స్వాగతం పలికారు. పెళ్లి తంతులో భాగంగా స్టేజ్‌పై కొత్త జంట ఒకరికొకరు స్వీట్లు తినిపించుకోబోయారు. ఈ క్రమంలో వరుడు వధువుకు ఎంతో ప్రేమగా స్వీట్ తినిపించబోయాడు. ఇంతలో ఏమైందో ఏమో తెలియదు కానీ, వధువు ఆ స్వీట్‌ను నిరాకరించింది. అయినా వినకుండా వరుడు ఆమెకు స్వీట్ బలవంతంగా పెట్టబోయాడు.
దీంతో ఆగ్రహించిన పెళ్లి కుమార్తె.. వరుడి చేతిని పక్కకు నెట్టేసి చెంపపై లాగిపెట్టి కొడుతుంది. అందరి ముందు వధువు చేయిచేసుకోవడంతో కోపోద్రిక్తుడైన వరుడు ఆమె రెండు చెంపలపై వాయిస్తాడు. ఈ క్రమంలో ఇద్దరూ జుట్లు పట్టుకుని మరీ కొట్టుకుంటారు. కొత్త జంట ఘర్షణతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏం జరుగుతోందో తెలుసుకునేలోపు ఇద్దరూ జటీపటి పడతారు. పక్కనున్న వాళ్లు వారిద్దరినీ నిలువరించేందుకు ఎంత ప్రయత్నించినా ఫలితం ఉండదు. అప్పటిదాకా ఎంతో సందడిగా సాగిన పెళ్లి వేడుక.. ఈ ఘటనతో ఒక్కసారిగా వేడెక్కుతుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Kalesh B/w Husband and Wife in marriage ceremony pic.twitter.com/bjypxtJzjt
— Ghar Ke Kalesh (@gharkekalesh) December 13, 2022