అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ వీడియో ఒకటి నెట్టింట నవ్వులు పూయిస్తున్నది. పక్కకు ఎవరూ లేకున్నా అమెరికా ప్రెసిడెంట్ కరచాలనం చేసేందుకు చేయి చాచారు. అనంతరం చుట్టూ గందరగోళంగా చూశారు. అక్కడినుంచి వెళ్లిపోయారు. ఈ వీడియో నెట్టింట వైరల్‌గామారింది.
జో బిడెన్.. నార్త్ కరోలినాలోని గ్రీన్స్బోరోను సందర్శించారు. ఏ అండ్ టీ స్టేట్ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన సభలో 40 నిమిషాలు ప్రసంగించారు. తన స్పీచ్ అయిపోగానే జో బిడెన్ పోడియం వద్ద కుడివైపుకు తిరిగారు. ఎవరికో కరచాలనం ఇస్తున్నట్లు చేయి ముందుకు చాచారు. అయితే, అక్కడ ఎవరూ లేకపోవడం గమనార్హం. ఈ వీడియోను ట్విటర్లో వాషింగ్టన్ ఫ్రీ బీకన్ అనే యూజర్ పోస్ట్ చేయగా, చక్కర్లు కొడుతోంది. ఇప్పటివరకూ ఆరు మిలియన్ల మంది ఈ వీడియోను చూశారు.
After Biden finished his speech, he turned around and tried to shake hands with thin air and then wandered around looking confused pic.twitter.com/ZN00TLdUUo
— Washington Free Beacon (@FreeBeacon) April 14, 2022