Darsanam Mogulaiah : భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ పాడిన ‘దర్శనం మొగులయ్య’ వాడే వాద్య పరికరం ఏంటో తెలుసా?
భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ పాడిన దర్శనం మొగులయ్య | భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్‌ను ఒక జానపద గీతంలా విడుదల చేశారు. దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులు ఆ పాటకు అతుక్కుపోతున్నారు.
ఇవాళ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా.. ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ భీమ్లా నాయక్.. టైటిల్ సాంగ్‌ను మూవీ యూనిట్ విడుదల చేసింది. ప్రస్తుతం ఆ పాట యూట్యూబ్‌లో నెంబర్ వన్ ట్రెండింగ్‌లో ఉండటంతో పాటు.. విడుదలైన కొంతసేపటికే.. రికార్డు స్థాయిలో వ్యూస్ సాధించింది.

సెభాష్.. ఆడాగాదు ఈడాగాదు.. అమీరోళ్ల మేడాగాదు.. గుర్రంనీళ్లా గుట్టాకాడ.. అలుగూ వాగు తాండాలోన బెమ్మాజెముడు చెట్టున్నాది.. బెమ్మజెముడూ చెట్టూకింద అమ్మా నెప్పులు పడతన్నాది.. ఎండాలేదు రేతిరిగాదు.. ఏగూసుక్కా పొడవంగానే పుట్టిండాడు పులిపిల్ల.. పుట్టిండాడు పులిపిల్ల.. నల్లామల తాలూకాల అమ్మా పేరు మీరాబాయి.. నాయన పేరు సోమ్లా గండు.. తాతా పేరు బహద్దూర్.. ముత్తులతాత ఈర్యానాయక్.. పెట్టిన పేరు భీమ్లా నాయక్.. సెభాష్ భీమ్లా నాయకా… అంటూ సాగే భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్‌కు గాత్రాన్ని అందించారు దర్శనం మొగులయ్య.
టైటిల్ సాంగ్ ప్రారంభంలో వచ్చే ఈ లిరిక్స్‌ను పాడింది మొగలయ్యే. ఆ తర్వాత కొనసాగింపు పాటను శ్రీకృష్ణ, పృథ్వీ చంద్ర, రామ్ మిరియాల పాడారు.

భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్‌ను ఒక జానపద గీతంలా విడుదల చేశారు. దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులు ఆ పాటకు అతుక్కుపోతున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా.. ఈ పాటకు గాత్రం అందించిన దర్శనం మొగులయ్య పాడిన పాటకు అందరూ ఫిదా అవుతున్నారు. ఈ పాట విడుదల కాగానే.. మొగులయ్య ఎవరు? ఆయన చేతిలో ఉన్న వాద్య పరికరం ఏంటి? అంటూ ఆయన గురించి నెట్లో సెర్చ్ చేస్తున్నారు.
అయితే.. దర్శనం మొగులయ్య తెలంగాణ ప్రజలకు సుపరిచితుడే. ముఖ్యంగా.. జానపద గేయాలపై మక్కువ ఉన్నవాళ్లకు ఆయన గురించి తెలుసు.
దర్శనం మొగులయ్య వాద్య పరికరం గురించి
దర్శనం మొగులయ్య వాడే వాద్య పరికరం పేరు కిన్నెర. ఇది చాలా అరుదైన వాయిద్యం. శతాబ్దాల నాటి చరిత్ర ఉన్న పరికరం ఇది. కానీ.. దీన్ని ఇప్పుడు ఎక్కువగా వినియోగించడం లేదు. తన తాతల కాలం నాటి నుంచి కిన్నెర వాద్య పరికరాన్ని ఉపయోగిస్తున్నారు. ఈ అరుదైన కిన్నెరను వాయిస్తున్న ఏకైక జానపద కళాకారుడు దర్శనం మొగులయ్య.

దీన్నే మెట్ల కిన్నెర అని కూడా అంటారు. తెలంగాణ వీరగాథలను దర్శనం మొగులయ్య అద్భుతంగా కిన్నెర వాయిస్తూ వినిపిస్తారు. ఆయనది నాగర్ కర్నూలు జిల్లాలోని తెల్కపల్లి మండలం గట్టురావిపాకుల గ్రామం.
తనకు 12 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచే మొగులయ్య.. కిన్నెర పరికరాన్ని వాయించడం నేర్చుకున్నాడు. ఎండమెట్ల ఫకీరయ్య, వట్టెం రంగనాయకమ్మ, మీర్ సాబ్ కథ, కురుమన్న లాంటి వీరగాథలు చెప్పడంలో మొగులయ్య దిట్ట.
కిన్నెర పరికరాన్ని ఎలా తయారు చేస్తారు?
కిన్నెర పరికరాన్ని మొగులయ్యే తయారు చేసుకుంటాడు. రౌండ్ షేప్‌లో ఉండే సోరకాయలను తీసుకొని.. వాటికి వెదురు, తీగలు, ఎద్దుకొమ్ములు, మైనం, తేనె, అద్దాలు అమర్చి.. నేర్పుతో దీన్ని తయారు చేస్తారు.
తాజాగా భీమ్లా నాయక్‌లో ఆయన పాడిన జానపద గేయానికి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఆ పాటకు ఆయన మరింత వన్నె తెచ్చాడు.
దర్శనం మొగులయ్య జానపద కళను గుర్తించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు పలు అవార్డులను అందించింది. ప్రస్తుతం ఆయన తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుడిగా ఉన్నాడు.

Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

