Viral Video | మన దేశంలో ప్రధాన నగరాల్లో విపరీతమైన ట్రాఫిక్ ఉంటోంది. టైమ్‌కి గమ్యానికి చేరాలంటే ఇంటి దగ్గర కనీసం గంట, రెండు గంటల ముందే బయలుదేరాల్సిన పరిస్థితి. ముఖ్యంగా మెట్రో నగరాల్లో ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోతోంది. ట్రాఫిక్ సమస్యలను తీర్చేందుకు అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ.. రోడ్లపై వాహనాల రద్దీ మాత్రం తగ్గడం లేదు. తాజాగా బెంగళూరు నగరంలోని ట్రాఫిక్ పరిస్థితి తెలియజెప్పే వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
మరికాసేపట్లో తన పెళ్లి. ఇంటి నుంచి మండపానికి కారులో బయలు దేరింది ఓ వధువు. అయితే, మధ్యలో ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయింది. ట్రాఫిక్ రద్దీ విపరీతంగా ఉండటంతో ముహూర్తం సమయానికి కల్యాణ మండపానికి చేరుకోలేనని భావించిన వధువు.. మధ్యలో కారు దిగి మెట్రో ఎక్కేసింది. దీంతో వధువును చూసి ప్రయాణికులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు.
ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ట్రాఫిక్ కష్టాల నుంచి బయటపడేందుకు యువతి సమయస్ఫూర్తితో ఆలోచించింది అంటూ ఆమెను ప్రశంసిస్తున్నారు. ‘స్మార్ట్ పెళ్లికూతురు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Whatte STAR!! Stuck in Heavy Traffic, Smart Bengaluru Bride ditches her Car, & takes Metro to reach Wedding Hall just before her marriage muhoortha time!! @peakbengaluru moment 🔥🔥🔥 pic.twitter.com/LsZ3ROV86H
— Forever Bengaluru 💛❤️ (@ForeverBLRU) January 16, 2023