పెద్దలంటే ఎలాగైనా హెయిర్ కట్ చేయించుకుంటారు. కానీ.. పిల్లలు హెయిర్ కట్ అనగానే భయపడిపోతారు. బెంబేలెత్తుతారు. వామ్మో.. నాకొద్దు కటింగ్ అంటూ మారాం చేస్తారు. సెలూన్ షాప్‌లోకే రారు. బార్బర్ కత్తెర పట్టుకోగానే.. తెగ ఏడ్చేస్తారు. అందుకే.. చాలామంది పెద్దలే దగ్గరుండి.. వాళ్లు ఏడవకుండా.. ఏదో ఒకటి కొనిచ్చి.. వాళ్లు కటింగ్ చేసుకునేలా ఓదార్చుతారు.
ఇలాగే.. ఓ పిల్లాడు.. కటింగ్ చేయనీయకుండా.. గుక్క పెట్టి ఏడ్వడం మొదలు పెట్టాడు. దీంతో ఏం చేయాలో బార్బర్‌కు అర్థం కాలేదు. ఎలాగైనా ఆ బాలుడికి కటింగ్ చేయాలన్న ఉద్దేశంతో.. సెలూన్లో ఉన్న బార్బర్లు అందరూ పాట పాడటం మొదలు పెట్టారు. దీంతో.. గుక్క పెట్టి ఏడ్చే చిన్నారి కాస్త కూల్ అయ్యాడు. అందరూ పాట పాడుతుంటే వాళ్లవైపు చూడటం మొదలు పెట్టాడు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ.. ఆ వీడియో మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
6.5 లక్షలు పెట్టి వేలంలో కొబ్బరికాయ కొన్న పళ్ల వ్యాపారి.. ఏంటి ఆ కొబ్బరికాయ స్పెషాలిటీ?
హైదరాబాద్ సిటీలో ఎంత స్పీడ్‌తో వాహనాలు నడపాలో తెలుసా
sai dharam tej accident | హైదరాబాద్‌లో ఎన్ని స్పోర్ట్స్ బైక్స్ ఉన్నాయో తెలుసా?
పుట్టింటికి వెళ్తానంటే భార్య ముక్కు కోసిన భర్త..!