Viral Video | ముంబై లోకల్ ట్రైన్లో.. యువతితో కలిసి చిందులేసిన కానిస్టేబుల్
Viral Video | ముంబై లోకల్ ట్రైన్ ( Mumbai local train)లో యువతితో కలిసి పోలీసు కానిస్టేబుల్ చిందులేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ను షేక్ చేసేస్తోంది.
Viral Video | ఇది ఇంటర్నెట్ యుగం.. అందరి చేతుల్లోనూ స్మార్ట్ ఫోన్లు ఉంటున్నాయి. స్మార్ట్ ఫోన్ వాడే ప్రతి ఒక్కరికీ సోషల్ మీడియా ఖాతాలుంటున్నాయి. సోషల్ మీడియా ద్వారా తమ టాలెంట్‌తో ఫేమస్ అవ్వాలని పరితపించిపోతున్నారు. అందులో యువత ముందు వరుసలో ఉంటున్నారు. ఎక్కడికి వెళ్లినా రీల్స్ పేరుతో వీడియోలు చేస్తూ గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నారు. మెట్రో రైళ్లు, లోకల్ ట్రైన్స్, బస్టాండ్ ఇలా ఎక్కడపడితే అక్కడ రీల్స్ చేసి వాటితో సోషల్ మీడియాను షేక్ చేసేస్తున్నారు.
ఇలాంటి తరహా ఘటనకు సంబంధించి ఆసక్తికర వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఓ యువతి ముంబై లోకల్ ట్రైన్ ( Mumbai local train)లో రీల్స్ చేస్తుండగా.. ఆమెతో ఓ కానిస్టేబుల్ (constable) కూడా చిందులేయడం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఓ యువతి లోకల్ ట్రైన్లో డ్యాన్స్ చేస్తూ కనిపించింది. ఆమె వెనుకే ఓ పోలీసు కానిస్టేబుల్ నిలబడి ఉంటాడు. అయితే అనుకోకుండా డ్యాన్స్ చేసే క్రమంలో సదరు యువతి పోలీసును తగులుతుంది. దీంతో ఆమె ఒక్కసారిగా ఆగిపోయి.. అతను ఏమంటాడో అన్న భయంతో ఉండిపోతుంది. అయితే, పోలీసు మాత్రం ‘డోర్ వద్దకు వెళ్లొద్దు పడిపోతావు’ అంటూ యువతికి జాగ్రత్త చెప్తాడు. ఆ తర్వాత యువతి డ్యాన్స్ చేయడం కొనసాగిస్తుంది. అప్పుడు ఆమెతోపాటు ఆ పోలీసు కానిస్టేబుల్ కూడా కాలుకదుపుతాడు. ఇద్దరూ కలిసి ఫుల్ జోష్‌తో డ్యాన్స్ చేస్తారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ను షేక్ చేసేస్తోంది.
Everyone Vibing 🗿 pic.twitter.com/fppiwirZtf
— विवेक (@Vivekspeaks_) December 8, 2023
Also Read..
Infosys | ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఉద్యోగులు వారంలో 3 రోజులు ఆఫీసుకు రావాల్సిందే
Shah Rukh Khan | డంకీ రిలీజ్‌కు ముందు వైష్ణోదేవి ఆలయానికి వెళ్లిన షారుఖ్.. ఏడాదిలో మూడోసారి
Pakistan | పాకిస్థాన్ ఆర్మీబేస్‌పై ఆత్మాహుతి దాడి.. 23 మంది మృతి
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

