వ్యాయామం చేసేందుకు 20-30 ఏళ్ల మధ్యవారే బద్ధకిస్తుంటారు. కానీ, ఓ 72 ఏళ్ల బామ్మ ఓపెన్ జిమ్‌లో ప్రతిరోజూ కసరత్తులు చేస్తున్నది. అన్ని పరికరాలపై వ్యాయామం చేస్తూ ఆశ్చర్యపరుస్తున్నది. యువతరానికి ప్రేరణగా నిలుస్తున్నది.
జగిత్యాల జిల్లాలోని శంకులపల్లె గ్రామానికి నీలి పెద్ద రాజవ్వ వయస్సు 72 ఏళ్లు. గృహిణి అయిన పెద్ద రాజవ్వకు ఆరోగ్యంపై శ్రద్ధ ఎక్కువ. ప్రతి ఒక్కరూ ఫిట్‌గా ఉండాలనే ఉద్దేశంతో తెలంగాణ సర్కారు ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్‌లో పెద్ద రాజవ్వ ప్రతిరోజూ కసరత్తులు చేస్తోంది. నిత్యం తప్పకుండా ఇక్కడికి వచ్చి 40 నిమిషాలు వ్యాయామం చేస్తున్నది. ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు ఆమె కాన్ఫిడెన్స్ లెవల్స్ చూసి, అంతా ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.