IRCTC Kerala Tour | వేసవిలో కేరళ టూర్.. ఐఆర్సీటీసీ అద్భుత ప్యాకేజీ
IRCTC Kerala Tour | మీరు పర్యాటక ప్రియులా!.. ఈ వేసవిలో కేరళ టూర్ ప్లాన్ చేస్తున్నారా? అయితే మీ కోసమే ఐఆర్సీటీసీ బంపర్ టూర్ ప్యాకేజీని తీసుకువచ్చింది.
IRCTC Kerala Tour 2023 | కేరళ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేవి.. ప్రకృతి అందాలు, తేయాకు తోటలు, బోటు షికార్లు.. అలాంటి ప్రకృతి అందాలకు నెలవైన కేరళను చూడాలని చాలా మందికి ఉంటుంది. అయితే, అతి తక్కువ ఖర్చుతో కేరళ టూర్ (Kerala tour) వెళ్దామనుకునే వారి కోసం ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) కేరళ టూర్ ప్రత్యేక ప్యాకేజీని తీసుకొచ్చింది.
కేరళ హిల్స్ అండ్ వాటర్స్ (KERALA HILLS & WATERS) పేరుతో ఐఆర్సీటీసీ ఈ టూర్ ప్యాకేజీని అందిస్తోండగా.. మే 9 నుంచి జూన్ 27 వరకు ఈ ప్యాకేజీని (KERALA Tour Package) బుక్ చేసుకోవచ్చు. ఈ టూర్ ప్యాకేజీలో మున్నార్ (Munnar), ఎర్నాకుళం(Ernakulam) నేషనల్ పార్క్ (Ernakulam National park), టీ మ్యూజియం (Tea museam), మట్టుపెట్టి డ్యామ్(Mattu petti dam), అలెప్పీ (Alleppey) తదితర పర్యాటక ప్రాంతాలు సందర్శించవచ్చు. హైదరాబాద్ నుంచి టూర్ ప్రారంభం అవుతుండగా.. ఇది 5 రాత్రులు, 6 రోజులు కొనసాగుతుంది. మే 9 నుంచి వారానికోసారి సికింద్రాబాద్ నుంచి కేరళకు రైలు (శబరి ఎక్స్ప్రెస్) అందుబాటులో ఉంటుంది. గుంటూరు, నల్గొండ, సికింద్రాబాద్, తెనాలి రైల్వేస్టేషన్లలో టూరిస్టులు ఈ రైలు ఎక్కొచ్చు.. టూర్ ముగిసిన తర్వాత తిరిగి అదే స్టేషన్లలో దింపుతారు.
ప్రయాణం సాగుతుంది ఇలా
Day 01: మొదటి రోజు మధ్యాహ్నం హైదరాబాద్లో టూర్ ప్రారంభం అవుతుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మధ్యాహ్నం 12:20 గంటలకు శబరి ఎక్స్ప్రెస్లో ప్రయాణం మొదలవుతుంది. రాత్రంతా ప్రయాణించాల్సి ఉంటుంది.
Day 02: రెండోరోజు మధ్యాహ్నం 12.55 నిమిషాలకు ఎర్నాకులం రైల్వే స్టేషన్ కు చేరుకుని అక్కడ్నుంచి మున్నార్ వెళ్తారు. హోటల్ లోకి చెకిన్ అయిన తర్వాత… సాయంత్రం మున్నార్ టౌన్ లో పర్యటిస్తారు. రాత్రి మున్నార్ లోనే బస ఉంటుంది.
Day 03 : మూడో రోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేసి ఎర్నాకులం నేషనల్ పార్క్ కు వెళ్తారు. తర్వాత టీ మ్యూజియం, మట్టుపెట్టి డ్యాం, ఎకో పాయింట్ సందర్శన ఉంటుంది. రాత్రి మున్నార్ లోనే బస చేస్తారు.
Day 04 : నాలుగో రోజు హోటల్లో బ్రేక్ఫాస్ట్ ముగించుకున్నాక అలెప్పీ అందాలను వీక్షించటానికి వెళ్తారు. దాంతో నాలుగో రోజు పర్యటన ముగుస్తుంది. రాత్రి అలెప్పీలో బస చేస్తారు.
Day 05 : ఐదో రోజు అలెప్పీ హోటల్ నుంచి నుంచి చెక్ అవుట్ తర్వాత ఎర్నాకులం వస్తారు. ఉదయం 11.20 నిమిషాలకు శబరి ఎక్స్ప్రెస్లో తిరుగు ప్రయాణం మొదలవుతుంది.
Day 06 : మధ్యాహ్నం 12:20 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరుకోవటంతో టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.
ఐఆర్సీటీసీ కేరళ టూర్ ప్యాకేజీ ధర
ఇక చార్జీల విషయానికి వస్తే.. ప్యాకేజీలో ఒక్కరు ప్రయాణించాలనుకుంటే రూ. 32230 చెల్లించాల్సి ఉంటుంది. ఇద్దరు వ్యక్తులు కలిసి ప్రయాణిస్తే ఒక్కొక్కరు రూ.18740, ముగ్గురు వ్యక్తులు కలిసి ప్రయాణిస్తే రూ.15130 చెల్లించాల్సి ఉంటుందని ఐఆర్సీటీసీ తెలిపింది. 5 నుంచి 11 సంవత్సరాల వయసు ఉన్న చిన్నారులకు కూడా టికెట్ ధరలు నిర్ణయించారు. వారికి ఒకరికి బెడ్తో అయితే రూ.8730, బెడ్ లేకుండా అయితే రూ.6530 చెల్లించాల్సి ఉంటుంది. ఏప్రిల్ నుంచి జూన్ నెల వరకు ఈ ధరలే అందుబాటులో ఉంటాయి. ఈ టూర్ ప్యాకేజీలో ట్రైన్ టికెట్లు, హోటల్లో బస, బ్రేక్ఫాస్ట్ (మధ్యాహ్నం పూట భోజనం, రాత్రి భోజనం యాత్రికులే చూసుకోవాలి). ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి.
పూర్తి వివరాల కోసం.. IRCTC క్రింది వెబ్సైట్ లింక్ క్లిక్ చేయండి
https://www.irctctourism.com/pacakage_description?packageCode=SHR092
Read Today's Latest Tourism News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

