కొత్తగూడానికి త్వరలో వెయ్యిపడకల దవాఖాన

- మంత్రి పువ్వాడ అజయ్
కొత్తగూడెం, మే 18: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు వెయ్యిపడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ త్వరలో కార్యరూపం దాల్చనున్నదని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. మంగళవారం ఆయన భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో పర్యటించారు. ముందుగా భద్రాచలం ఏరియా దవాఖానలో 13 వేల కిలోలీటర్ల లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంటును ప్రారంభించారు. కరోనా రోగులకు స్వయంగా భోజనం అందజేశారు. అనంతరం భద్రాచలం సబ్‌కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో, పలు ప్రారంభోత్సవాల్లో పాల్గొని మాట్లాడారు. కరోనా నియంత్రణకు ప్రభుత్వం సర్కారు దవాఖానల్లో సకల సౌకర్యాలు కల్పిస్తుందని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో కొవిడ్ ఆక్సిజన్ దవాఖానలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఆయా కార్యక్రమాల్లో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, పొదెం వీరయ్య, కలెక్టర్ ఎంవీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Topstories News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
చండ్రుగొండలో నీట మునిగిన పంట పొలాలు
BJP leader’s son dies by suicide | బీజేపీ నేత కుమారుడు ఆత్మహత్య.. భార్య వేధింపులపై వీడియో
విద్యార్థులపై తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉండాలి : శశిధర్ శర్మ
Vocational Trainers | 12 నెలల జీతాల్లేవ్.. సెక్రటేరియట్ ముందు ఒకేషనల్ ట్రైనర్ల ఆందోళన.. వీడియో
Cancer | క్యాన్సర్‌ను నయం చేస్తామంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం.. హెచ్చరిస్తున్న వైద్య నిపుణులు..
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

