పండుగ బొనాంజా
పండుగల సీజన్ మొదలైంది. బ్యాంకులు రుణాల మీద వడ్డీలు తగ్గిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనంత తక్కువ వడ్డీరేటుకే పర్సనల్ లోన్, కన్స్యూమర్ లోన్లతోసహా హౌజింగ్ లోన్లను అందిస్తున్నాయి. గతేడాది మార్చి నుంచి ఇప్పటిదాకా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక వడ్డీరేట్లను దాదాపు 1.25 శాతం తగ్గించడం కూడా ఇందుకు దోహదం చేసింది. కరోనా భయాలతో విలాస వస్తువులతోపాటు కొత్త ఇండ్ల కొనుగోళ్లు తగ్గిపోయాయి. అయితే వ్యాక్సినేషన్ ప్రక్రియ ఊపందుకోవడంతో ఈ భయాలు ఇప్పుడిప్పుడే తొలగిపోతున్నాయి. దీంతో ఈ పండుగల సీజన్లో వ్యాపారం భారీగా ఉంటుందని ఆటో, కన్స్యూమర్, హౌజింగ్ మార్కెట్ నిపుణుల అంచనా. దీనికి తగ్గట్టుగానే బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు వివిధ రకాల రుణాలపై కనీస వడ్డీరేట్లను ఆఫర్ చేస్తున్నాయి.
గృహ రుణాలు

ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకర్లతోపాటు బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్బీఎఫ్సీ)లూ గృహ రుణాలపై వడ్డీరేట్లను ఆకర్షణీయంగా తగ్గించాయి. ఎస్బీఐసహా బ్యాంకులన్నీ ఫెస్టివల్ బొనాంజా కింద హోమ్ లోన్లపై వడ్డీరేట్లను గణనీయంగా తగ్గించాయి. కొత్త రుణాలపైనే కాకుండా వేరే బ్యాంకు లేదా హౌజింగ్ ఫైనాన్స్ సంస్థ నుంచి లోన్‌ను మార్చుకున్నవారికీ 6.7 శాతం వడ్డీనే ఆఫర్ చేస్తున్నది. ప్రాసెసింగ్ ఫీజును కూడా రద్దు చేసింది. ఉద్యోగేతరులకూ ఈసారి చౌక వడ్డీరేట్లను అందుబాటులోకి తెచ్చింది. అయితే ప్రైవేట్ రంగ కొటక్ మహీంద్రా బ్యాంక్ 20 ఏండ్ల కాలపరిమితి గల రూ.75 లక్షల రుణానికి ఇంకా తక్కువగా 6.5 శాతం వడ్డీనే ఆఫర్ చేసింది. పంజాబ్ సింధ్ బ్యాంక్.. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో అతి తక్కువగా 6.65 శాతం వడ్డీని ప్రకటించింది. బ్యాంక్ ఆఫ్ బరోడా 6.75 శాతం వడ్డీకే అన్ని రకాల హౌజింగ్ రుణాలను అందిస్తున్నది. మొత్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకులన్నీ 7 శాతం కన్నా తక్కువ వడ్డీకే గృహ రుణాలను అందిస్తున్నాయి. ఎల్ఐసీ హౌజింగ్ ఫైనాన్స్ 6.7 శాతం, హెచ్డీఎఫ్సీ 6.75 శాతం చొప్పున హౌజింగ్ రుణాలను ఇస్తున్నాయి.
వ్యక్తిగత రుణాలు

గతంలో కేవలం గృహ రుణాలే 10 శాతం కన్నా తక్కువ వడ్డీరేటుకు లభించేవి. ఇప్పుడు వ్యక్తిగత రుణాలూ 10 శాతం కన్నా తక్కువ వడ్డీరేటుకే లభిస్తున్నాయి. కొవిడ్ ట్రీట్మెంట్ కోసం తీసుకునే పర్సనల్ లోన్కైతే 6.85 శాతం వడ్డీనే బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫర్ చేస్తున్నది. మొత్తంగా ఒకట్రెండు మినహా మిగతా బ్యాంకులు, ఎన్బీఎఫ్సీల్లో పర్సనల్ లోన్లు సగటున కేవలం 8.9 శాతం వడ్డీరేటుకే లభిస్తున్నాయి. ఒకప్పుడు 18 నుంచి 20 శాతం పలికిన వడ్డీరేట్లు.. ఇంతగా తగ్గడం ఇదే తొలిసారి. కొన్ని బ్యాంకులు ప్రాసెసింగ్ ఫీజులను కూడా రద్దు చేస్తున్నాయి. క్రెడిట్ స్కోర్ మెరుగ్గా ఉంటే వడ్డీరేట్లను మరింత తగ్గించడానికి కూడా ముందుకు వస్తున్నాయి. ఇక ఆటో, గోల్డ్ లోన్లపైనా వడ్డీరేట్లను ఆయా సంస్థలు ఆకర్షణీయంగా మార్చేశాయి.
ఎఫ్డీలకు దెబ్బ

వడ్డీరేట్లు కేవలం తీసుకునే రుణాలపైనేగాక ఆదాయం ఇచ్చే ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీ)పై కూడా తగ్గిపోయాయి. గతంలో ఎన్నడూలేనంత తక్కువకు పడిపోయాయి. దీంతో ఎఫ్డీలు ఇప్పుడు కస్టమర్లను ఏమాత్రం ఆకట్టుకోవడం లేదు. వారం రోజుల నుంచి పదేండ్ల కాల పరిమితిలో ఉండే ఎఫ్డీలపై 2.5 శాతం నుంచి 5.75 శాతం వరకే వడ్డీరేటు లభిస్తున్నది. కనీస కాల పరిమితికి పంజాబ్ సింధ్ బ్యాంక్ గరిష్ఠంగా 3 శాతం వడ్డీ ఇస్తుండగా, గరిష్ట కాల పరిమితికి యాక్సిస్ బ్యాంక్ ఎక్కువగా 5.75 శాతం వడ్డీని ఇస్తున్నది. అయితే సీనియర్ సిటిజన్లకు కనీస కాల పరిమితికి గరిష్ఠంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ 3.5 శాతం వడ్డీ ఇస్తున్నది. అలాగే గరిష్ఠ కాల పరిమితికి యాక్సిస్ బ్యాంక్ 6.5 శాతం వడ్డీ కట్టిస్తున్నది.
Read Today's Latest Top-slides News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
హెచ్‌డీఎస్‌ఏ నూతన కార్యవర్గం ఎన్నిక
KTR | రాష్ట్రంలో ఇన్ని హాలిడేలు ఎందుకు.. రేవంత్ రెడ్డికి హాలిడే చెబితే లొల్లిపోదా.. కేటీఆర్ సెటైర్లు
KTR | నల్లమల పిల్లికి ఎలుకలు పట్టడం కూడా చేతనైతలేదా.. రిమ్స్ ఘటనపై కేటీఆర్ ఎద్దేవా
KTR | తెలంగాణకు ప్రధాని మోదీ ఏం ఇచ్చారు.. బీజేపీకి ఎందుకు ఓటేయాలి.. బడే బాయ్ – చోటే బాయ్ బంధంపై కేటీఆర్ ఫైర్
Back Pain | వెన్ను నొప్పికి అసలు కారణాలు ఏమిటి.. ఎలాంటి జాగ్రత్తలను పాటించాలి..
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

